Advertisement

తన కొడుకు పై మెగాస్టార్ కు ఫిర్యాదు..?

By: Anji Fri, 16 Oct 2020 10:12 AM

తన కొడుకు పై మెగాస్టార్ కు ఫిర్యాదు..?

మెగాస్టార్ చిరంజీవి సాధారణంగా ఎవ్వరినీ దూరం పెట్టరు. అలాగే ఆయన బహిరంగంగా కోపం కనబర్చిన సందర్భాలు అరుదు. అయితే రీసెంట్ గా ఇండస్ట్రీలో ఓ వార్త మాత్రం చక్కర్లు కొడుతుంది. ఓ దర్శకుడి మీద మెగాస్టార్ చిరు కాస్త కోపంతో వున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం మరేమీ కాదని, ఆయన కొడుకు చరణ్ మీదనే ఆయన దగ్గర కాస్త కంప్లయింట్ మాదిరిగా మాట్లాడడమే అని ఆ వార్త ఎక్స్ టెన్షన్.

విషయం ఏమిటంటే, ఓ సినిమా ఫినిష్ కావాలంటే చరణ్ కోపరేషన్ అవసరం అని, కానీ ఆయన ఏమీ పట్టనట్లు వున్నారని, అందుకే ఓ మాట చెప్పమని ఆ డైరక్టర్ మెగాస్టార్ ను కోరినట్లు గాసిప్ వినిపిస్తోంది. ఆ మాటకు అలాగే, తప్పకుండా అని అనేసారు కానీ అప్పటి నుంచి ఆ దర్శకుడి మీద కాస్త కసి వహించారని టాక్ వినిపిస్తోంది.

తన కొడుకు మీద తనకే ఫిర్యాదు చేయడం ఏమిటి? అని మెగాస్టార్ ఫీలయినట్లు బోగట్టా. ఎంతవరకు నిజం వుందీ ఆ వార్త లో అన్న సంగతి మాత్రం తెలియదు కానీ, ఈ వార్త చలామణీ మాత్రం బాగానే అవుతోంది.

Tags :

Advertisement