Advertisement

  • బాక్స‌ర్ సినిమాలో ముగ్గురు స్టార్ హీరోస్...!

బాక్స‌ర్ సినిమాలో ముగ్గురు స్టార్ హీరోస్...!

By: Anji Sun, 13 Dec 2020 6:34 PM

బాక్స‌ర్ సినిమాలో ముగ్గురు స్టార్ హీరోస్...!

ఎఫ్ 2, గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ నుంచి రాబోతున్న సినిమా బాక్సర్.

డెబ్యూ డైరెక్ట‌ర్ కిర‌ణ్ కొర్ర‌పాటి రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాక్స‌ర్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు ఈ ఫిదా స్టార్.

అంతేకాదు.. ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకుని మ‌రీ ఈ సినిమాలో న‌టిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ ఇందులో వ‌రుణ్ కి జోడీగా న‌టిస్తుండ‌గా.. అమ్మ పాత్ర‌లో సీనియ‌ర్ హీరోయిన్ న‌దియా క‌నిపించ‌నుంది.

ఇదిలా ఉంటే.. బాక్స‌ర్ లో వేర్వేరు వుడ్స్ కి చెందిన ముగ్గురు స్టార్ హీరోస్ సంద‌డి చేయ‌నున్నార‌ని టాక్. వ‌రుణ్ కి తండ్రిగా శాండ‌ల్ వుడ్ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర న‌టించ‌నుండ‌గా.. కోచ్ గా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి క‌నిపిస్తార‌ని స‌మాచారం.

ఇక విల‌న్ రోల్ లో టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ జ‌గ‌ప‌తి బాబు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మ‌రి.. ఆస‌క్తిక‌ర‌మైన తారాగ‌ణంతో తెర‌కెక్కుతున్న బాక్స‌ర్.. బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాన్ని రాబ‌డుతుందో తెలియాలంటే వ‌చ్చే ఏడాది వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Tags :

Advertisement