Advertisement

  • రాంగోపాల్ వర్మ మరో హర్రర్ చిత్రం '12 ఓ క్లాక్'

రాంగోపాల్ వర్మ మరో హర్రర్ చిత్రం '12 ఓ క్లాక్'

By: chandrasekar Sat, 04 July 2020 12:06 PM

రాంగోపాల్ వర్మ మరో హర్రర్ చిత్రం '12 ఓ క్లాక్'


కరోనా మహమ్మారి ప్రబలంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో సైతం వరుసగా సినిమాలు చేసేస్తున్నారు వర్మ. దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ లాక్ డౌన్ సమయంలో ఎక్కడికక్కడ నిలిచిపోతే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం నిర్విరామంగా శ్రమిస్తూ కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు.

కరోనా మహమ్మారి ప్రబలంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో సైతం వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. అంతేకాకుండా వాటిని ప్రత్యేకమైన యాప్ ద్వారా ఆన్ లైన్ లో 'పే ఫర్ వ్యూ' విధానంలో విడుదల చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో నిర్మించి, ఎక్కువ లాభాలను పొందుతున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటికే ఆర్జీవీ 'క్లైమాక్స్', 'నేకేడ్' చిత్రాలను ఈ లాక్ డౌన్ కాలంలో నిర్మించి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వర్మ మరో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. '12 ఓ క్లాక్' (12 O' CLOCK) అనే టైటిల్ తో మరో హారర్ చిత్రమని వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అయితే ఇది షార్ట్ ఫిలిం కాదని, ఒక గంట 45 నిమిషాల నిడివితో ఈ సినిమా సాగుతుందని ఆయన చెప్పారు. ఈ రాత్రి ఏడు గంటలకు దీని ట్రైలర్ ని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక సినిమా కూడా త్వరలోనే విడుదల అవుతుందని సమాచారం.

Tags :
|

Advertisement