Advertisement

  • బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన గమనిక... మూడు రోజులు సెలవు...!

బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన గమనిక... మూడు రోజులు సెలవు...!

By: Anji Sun, 15 Nov 2020 12:49 PM

బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన గమనిక... మూడు రోజులు సెలవు...!

బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. బ్యాంక్‌లో మీకు ఏమైనా పని ఉంటే.. లేదంటే మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన పని ఉంటే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి.

బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. దీంతో బ్యాంక్ కస్టమర్లపై కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది.

నవంబర్ 15న ఆదివారం. ఈరోజు బ్యాంకులు ఎలాగూ పని చేయవు. నవంబర్ 16న చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. బలిప్రతిపద/లక్ష్మీ పూజ/ విక్రమ్ సంవత్ న్యూ ఇయర్ ఇందుకు కారణం.

ఇకపోతే పలు రాష్ట్రాల్లో నవంబర్ 20, 21 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. చత్ ఫెస్టివల్ ఇందుకు కారణం. ఇక నవంబర్ 22 ఆదివారం. అంటే మూడు రోజులు బ్యాంకులు క్లోజ్.

అంతేకాకుండా నవంబర్ 28న నాలుగో శనివారం ఉంది. ఈరోజు బ్యాంకులు పని చేయవు. తర్వాత ఆదివారం. ఈరోజు కూడా బ్యాంకులకు హాలిడే.

తర్వాత నవంబర్ 30న గురు నానక్ జయంతి ఉంది. ఈరోజు కూడా బ్యాంకులు పనిచేయవు. అంటే బ్యాంకులు మళ్లీ మూడు రోజులు పనిచేయవు.

ఇకపోతే బ్యాంక్ కస్టమర్లు ఒక విషయాన్ని గుర్తించాలి. బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా నెట్ బ్యాంకింగ్ సేవల ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి.

అందువల్ల మీరు మీకు ఏమైనా పనులు ఉంటే ఆన్‌లైన్‌లోనే చక్కబెట్టుకోవచ్చు. అయితే కచ్చితంగా బ్యాంకుకు వెళ్లాలంటే మాత్రం సెలవు దినాలను గుర్తుపెట్టుకోవాలి.

Tags :
|

Advertisement