Advertisement

  • మూడో విడుత బంగారం బాండ్ల జారీకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

మూడో విడుత బంగారం బాండ్ల జారీకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

By: chandrasekar Tue, 09 June 2020 5:36 PM

మూడో విడుత బంగారం బాండ్ల జారీకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం


ప్రస్తుత ఆర్థిక మంద గమనంలో బంగారం బాండ్లు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం మూడో విడుత పసిడి బాండ్లను సోమవారం జారీ చేయబోతున్నది. ఈ నెల 8 నుంచి 12 వరకు అందుబాటులో ఉండనున్న ఈ పసిడి బాండ్ల గ్రాము ధరను రూ.4,677గా రిజర్వుబ్యాంక్‌ నిర్ణయించింది.

పసిడి బాండ్లను కొనడానికి అన్‌లైన్‌తోపాటు డిజిటల్‌ ద్వారా చెల్లింపులు జరిపిన వారికి గ్రాముపై రూ.50 డిస్కౌంట్‌ను కల్పిస్తున్నది. మే నెలలో రూ.1,168 కోట్ల విలువైన 25 లక్షల యూనిట్ల బంగారం బాండ్లను ప్రభుత్వం విక్రయించింది. ఇదే ఇప్పటివరకు అత్యధిక విక్రయాలుగా ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మే 11 న ప్రారంభమై నాలుగు రోజులపాటు కొనసాగిన ఈ బాండ్ల జారీలో గ్రాము బంగారం ధరను రూ.4,590గా ఆర్బీఐ నిర్ణయించింది.

దేశంలో బంగారం వినిమయాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నవంబర్‌ 2015లో ఈ పసిడి బాండ్లను జారీని ప్రారంభించింది. ప్రతియేటా మూడు నుంచి నాలుగు సార్లు విక్రయిస్తున్న ఈ బాండ్లలో గ్రాము నుంచి 4 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చును. ఇప్పటివరకు మొత్తం 39 సార్లు గోల్డ్‌ బాండ్లను జారీచేశారు. 2016 అక్టోబర్‌ నెలలో అత్యధికంగా రూ.1,082 కోట్లు సేకరించిన ప్రభుత్వం ఇందులో 35.98 లక్షల యూనిట్లను విక్రయించింది. పసిడి బాండ్ల కొనుగోలుకు ప్రజలు ఉత్సాహాన్ని చూపుతున్నారు.

Tags :

Advertisement