Advertisement

  • జూన్ 11 న పోకో సంస్థ నుండి క్రొత్త పోకో ఎక్స్ టూ స్మార్ట్ ఫోన్

జూన్ 11 న పోకో సంస్థ నుండి క్రొత్త పోకో ఎక్స్ టూ స్మార్ట్ ఫోన్

By: chandrasekar Sat, 06 June 2020 7:30 PM

జూన్ 11 న పోకో సంస్థ నుండి క్రొత్త పోకో ఎక్స్ టూ స్మార్ట్ ఫోన్


ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో గురువారం భారతదేశంలో తన రెండవ ఫోన్ పోకోX2ను ఆవిష్కరించింది. అద్భుతమైన ఫీచర్ ఫోన్ ఈ నెల 11 నుంచి ఇండియాలో అమ్మకాలు జరగనున్నాయి. పోకో ఎక్స్ 2 స్మార్ట్‌ఫోన్ పోకో సంస్థ నుండి వస్తున్న రెండవ స్మార్ట్ ఫోన్. ఇప్పుడు ఈ బ్రాండ్ కంపెనీ స్వతంత్ర సంస్థ కావున భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన సేల్స్ కోసం ఇది స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది.

షియోమి నుంచి బయటకు వచ్చిన తరువాత రిలీజ్ చేస్తున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇది. ఏదేమైనా షియోమి బ్రాండ్‌ నుంచి విడిపోయాక పోకో భవిష్యత్తులో అంకితమైన సేవా కేంద్రాలతో వినియోగదారులకు సేవలు అందించడం ప్రారంభించవచ్చు. కానీ ప్రస్తుతానికి పోకో X2 వినియోగదారుల ఉత్పత్తి సంబంధిత సమస్యలను షియోమి సేవా కేంద్రాలు పరిష్కరిస్తాయి. పోకో X2 స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో మూడు వేరియంట్లలో విడుదలవుతుంది. ఇందులో బేస్ మోడల్ 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.15,999, 6GB ర్యామ్ + 128Gb స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 16,999, చివరిది హై రేంజ్ 8Gb ర్యామ్ + 256Gb స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.19,999 గా ఉంది. ఈ ఫోన్ అట్లాంటిస్ బ్లూ, మ్యాట్రిక్స్ పర్పుల్, ఫీనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో రిలీజ్ అయింది.

Tags :

Advertisement