Advertisement

  • స్మార్ట్ టీవీ, స్మార్ట్ ధర కాన్సెప్ట్ తో వ‌న్‌ప్లస్‌

స్మార్ట్ టీవీ, స్మార్ట్ ధర కాన్సెప్ట్ తో వ‌న్‌ప్లస్‌

By: chandrasekar Tue, 09 June 2020 7:15 PM

స్మార్ట్ టీవీ, స్మార్ట్ ధర కాన్సెప్ట్ తో వ‌న్‌ప్లస్‌


తొలుత విదేశాల సంకేతాలు అనుకూలించడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు బలపడినాయి. కానీ చివరికంత లేకపోవడంతో స్వల్ప లాభాలనే తెచ్చిపెట్టింది. ఈక్విటీ బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ సోమవారం ర్యాలీ తర్వాత లాభాలను బుక్‌ చేసుకోవడానికి పెట్టుబడిదారులు ముందుకురావడంతో స్వల్ప లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ముగిశాయి. 83 పాయింట్లు లాభపడి సెన్సెక్స్‌ 34,370 వద్ద ముగియగా 25 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 10,167 వద్ద ముగిసింది.

నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజీలో ముఖ్యంగా ఐటీ, ప్రైవేట్‌ బ్యాంకులు పుంజుకోగా మీడియా, ఫార్మా, ప్రైవేట్‌ బ్యాంకులు బలహీనపడ్డాయి. నిఫ్టీలో గెయిల్‌, ఇండస్‌ఇండ్‌, బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటర్స్‌, ఓఎన్జీసీ, టైటాన్‌, బజాజ్‌ ఫిన్‌ కొంత లాభపడ్డాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తుండటంతో ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. దాంతో పలు చమురు సంస్థల కౌంటర్లు వెలుగులోకి రావడంతో ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు ఎగబడటంతో లాభాలను పొందాయి.

ఎన్‌ఎస్‌ఈలో బీపీసీఎల్‌ షేరు 6.4 శాతం దూసుకెళ్లి రూ.393 వద్ద ట్రేడవుతోంది. హెచ్‌పీసీఎల్‌ 6.7 శాతం బలపడి రూ.218 వద్ద, ఐవోసీ కొంత మేర పుంజుకొని 4 శాతంతో రూ.93 వద్ద ట్రేడవుతున్నాయి. అన్‌లాక్‌-1 నేపథ్యంలో అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌, ప్రభుత్వ కార్యాలయాలను పూర్తిగా తెరిచేందుకు అనుమతివ్వడంతో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం పెరుగనున్నట్టు పరిశ్రమవర్గాలు చెప్తున్నాయి.

Tags :
|

Advertisement