Advertisement

  • రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ప్రపంచంలోనే 40వ అత్యంత విలువైన కంపనీగా గృర్తింపు

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ప్రపంచంలోనే 40వ అత్యంత విలువైన కంపనీగా గృర్తింపు

By: chandrasekar Fri, 11 Sept 2020 5:32 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ప్రపంచంలోనే 40వ అత్యంత విలువైన కంపనీగా గృర్తింపు


రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ప్రపంచంలోనే 40వ అత్యంత విలువైన కంపనీగా గృర్తింపు పొందింది. అనతి కాలంలో అప్పులు లేని కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చెప్పబడింది. ఇప్పుడు ఇది ప్రపంచంలోని అత్యంత విలువైన 40వ కంపెనీగా ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ చోటు సంపాదించింది. ఈరోజు స్టాక్ మార్కెట్లలో ఇంట్రా డేలో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 210 అమెరికన్ బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ప్రపంచ అత్యంత విలువైన 40 కంపెనీగా నిలిచింది. NSE ఇంట్రా డేలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయి రూ.2344.95కి చేరింది. అలాగే, రూ.2319 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఈ రోజు 7.29 శాతం వృద్ధి నమోదు చేసింది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపనీలో రిలయన్స్ ముందు స్థానంలో వుంది. రిలయన్స్ పీపీ 10 శాతం వృద్ది నమోదు చేసింది. ఆల్ టైమ్ హైలో రూ.1393.7 వద్ద క్లోజ్ అయింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.15.45 లక్షల కోట్లకు చేరింది. అయితే, మార్కెట్ క్లోజింగ్ సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 208.3 బిలియన్ డాలర్లుగా ఉంది.

దేశంలోని మార్కెట్ వర్గాల ప్రచారం భారత్‌కు చెందిన ఓ కంపెనీ 200 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను దాటడం ఇదే మొదటిసారి. మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత విలువైన 40వ కంపెనీగా రికార్డులకు ఎక్కింది. ఎక్సాన్ మొబిల్, పెప్సికో, సాప్, ఒరాకిల్, పి.ఫైజర్, నోవార్టిస్ లాంటి కంపెనీల కంటే ముందంజలో ఉంది. రిలయన్స్ అనేది ఆసియాలోని అత్యంత విలువైన 10 కంపెనీల్లో ఒకటి. రిలయన్స్ తాజాగా పాక్షిక చెల్లింపు షేర్లను జారీ చేసింది.

Tags :

Advertisement