Advertisement

వాట్సాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ పేమెంట్‌

By: chandrasekar Thu, 11 June 2020 5:14 PM

వాట్సాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ పేమెంట్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. దీంతో ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. ఈ క్రమంలో కరెన్సీని కూడా తాకేందుకు భయపడుతున్నారు. తమకు కావాల్సిన వస్తువులను ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేయడానికి చాలా రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి వాట్సాప్‌ పేమెంట్‌. ప్రపంచం మొత్తంలో ఇతరులతో చాటింగ్‌ చేసేందుకు వాడుతున్న యాప్‌లలో వాట్సాప్‌ ముందుంది.

వాట్సప్‌లో ఉన్న కాంటాక్టులతో చాటింగ్‌ చేయడంతో పాటు ఆన్‌లైన్‌ పేమెంట్‌ కూడా చేయవచ్చు. వాట్సాప్‌ పేమెంట్‌ యూపీఐ ఆధారంగా ఉంటుంది. ముందుగా మీ మొబైల్‌లో ఉన్న వాట్సాప్‌ను ఓపెన్‌ చేసి అందులో ఉన్న మూడు చుక్కల ఆప్సన్‌ను సెలక్ట్‌ చేయాలి. అందులో పేమెంట్స్‌పై క్లిక్‌ చేసి యాడ్‌ న్యూ పేమెంట్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసి కంటిన్యూపై క్లిక్‌ చేయాలి. తర్వాత మీ మొబైల్‌ నెంబర్‌కు లింక్‌ ఉన్న బ్యాంక్‌ వివరాలను సెలక్ట్‌ చేసుకోవాలి. మీ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా దీనిని కన్‌ఫాం చేయవచ్చు. ఈ ప్రాసెస్‌ను పూర్తి చేసేందుకు కంప్లీట్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి.

online,payment,via,whatsapp,money ,వాట్సాప్‌, ద్వారా, ఆన్‌లైన్‌, పేమెంట్‌, కరోనా వైరస్‌

వాట్సాప్‌ పేమెంట్‌ ద్వారా నగదు పంపేందుకు ఇతరుల మొబైల్‌లో కూడా వాట్సాప్‌ ఉండాలి. మీరు ఎవరికి నగదు పంపాలో వారి చాట్ విండోను ఓపెన్‌ చేసి పేమెంట్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసి యూపీఐ నెంబర్‌ నమోదు ద్వారా నగదు పంపవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైన మొబైల్‌ ఫోన్‌లోని వాట్సాప్‌ ద్వారా కరెన్సీ అవసరం లేకుండా మనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇతరులకూ నగదు పంపవచ్చు. దీని ద్వారా కరోనా బారిన పడకుండా ఉండడానికి వీలుంటుంది.

Tags :
|
|

Advertisement