Advertisement

సరికొత్త హంగులతో నోకియా 5310 విడుదల

By: Sankar Wed, 17 June 2020 2:45 PM

సరికొత్త హంగులతో నోకియా 5310  విడుదల



ఇప్పుడు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో రోజుకొక కొత్త ఫోన్ మార్కెట్లో విడుదల అవుతుంది ..వెనుక నాలుగు కెమెరాలు ముందు రెండు కెమెరాలు, హై డెఫినిషన్ డిస్ప్లే ఇలా ఎన్నో హంగులతో వివిధ ఫోన్లు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి ..అయితే ఇవన్నీ లేకముందు ఒకే ఒక్క ఫోన్ బ్రాండ్ ప్రపంచ ఫోన్ మార్కెట్ లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ..అదే నోకియా ..ఇప్పుడు జనరేషన్ కి నోకియా ఫోన్ గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ ఒక పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్తే ప్రతి పది మందిలో దాదాపు ఏడుగురు పైగానే నోకియా ఫోన్ వాడేవారు ..కానీ నోకియా కొత్త టెక్నాలజీకి త్వరగా అప్గ్రేడ్ అవ్వలేక పోటీలో చాలా వెనుకపడిపోయింది..

అయితే తాజాగా నోకియా5310 ఫీచర్‌ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. 2007లో నోకియా 5310 ఎక్స్‌ప్రెస్‌ మ్యూజిక్‌ పేరుతో వచ్చిన ఫీచర్‌ ఫోన్‌ను మరింత అప్‌గ్రేడ్‌ చేసి అందిస్తున్నామని హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సన్మీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ డ్యుయల్‌ సిమ్‌ ఫోన్‌ ధర రూ. 3,399 అని తెలిపారు.

ఈ ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌ ఎమ్‌పీ 3 ప్లేయర్, వైర్లెస్‌ ఎఫ్‌ఎమ్‌ రేడియో, వెనక వైపు ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన వీజీఏ కెమెరా. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, 16 ఎమ్‌బీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మెమెరీ, 1,200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయి. ఈ నెల 23 నుంచి నోకియా ఇండియా ఆన్‌లైన్, అమెజాన్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. వచ్చే నెల 23 నుంచి రిటైల్‌ స్టోర్స్‌లో లభ్యం కానున్నది.

Tags :
|
|
|

Advertisement