Advertisement

వాట్సాప్ లో కొత్త ఫీచర్స్

By: Sankar Sat, 13 June 2020 6:56 PM

వాట్సాప్ లో కొత్త ఫీచర్స్

కొత్త ఫీచర్లను అందిస్తూ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా మరిన్ని కొత్త ఫీచర్లను తెచ్చేందుకు వాట్సాప్‌ సన్నాహాలు చేస్తోంది. వీటిలో మల్టీ లాగిన్‌ డివైస్‌ సపోర్ట్‌, సెర్చ్‌ బై డేట్‌ ఆప్షన్‌, క్లియరింగ్‌ చాట్‌ ఫీచర్లు ఉన్నాయి. మల్టీ లాగిన్‌ డివైస్‌ సపోర్ట్‌ ఫీచర్‌తో ఒకేసారి వివిధ డివైస్‌లలో వాట్సాప్‌ లాగిన్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా వివిధ డివైస్‌ల నుంచి ఒకే సమయంలో చాట్‌ చేసే అవకాశం ఉంది. సమూహంగా ఏర్పడి పని చేసుకునే వారికి ఈ ఫీచర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఒక చోట లాగిన్‌ అయ్యి మరోకరు లాగిన్‌ అవ్వాలంటే ఖచ్చితంగా లాగ్‌అవుట్‌ అవ్వాల్సి ఉంటుంది.

ఇక, చాట్ విండోస్‌లో సరికొత్త 'సెర్చ్ ఆప్షన్' తీసుకురాబోతోందని డబ్ల్యూఏబేటాఇన్ఫో వెల్లడించింది. నిర్ధిష్ట తేదీ ఆధారంగా శోధించే సెర్చ్‌ బై డేట్‌ ఆప్షన్‌ను యూజర్లకు పరిచయం చేయబోతోందని తెలిపింది. అయితే ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని.. అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పట్టవచ్చని అభిప్రాయపడింది. సెర్చ్‌ బై డేట్‌ ఆప్షన్‌ అందుబాటులోకి వస్తే వాట్సాప్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతుంది.


Tags :
|

Advertisement