Advertisement

  • మేడ్ ఫర్ ఇండియన్ నినాదంతో కొత్త ఫోన్స్ లాంచ్ చేయబోతున్న మైక్రోమాక్స్

మేడ్ ఫర్ ఇండియన్ నినాదంతో కొత్త ఫోన్స్ లాంచ్ చేయబోతున్న మైక్రోమాక్స్

By: Sankar Fri, 19 June 2020 08:44 AM

 మేడ్ ఫర్ ఇండియన్ నినాదంతో కొత్త ఫోన్స్ లాంచ్ చేయబోతున్న మైక్రోమాక్స్



గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు మొబైల్ రంగంలో మైక్రోమాక్స్ ఒక ఊపు ఊపింది ..అయితే ఇటీవల కాలంలో కొత్త మోడల్స్ ఏమి మైక్రోమాక్స్ నుంచి రిలీజ్ కాలేదు..అయితే త్వరలో మనదేశంలో మూడు కొత్త స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేయనుంది. వీటిలో ఒక బడ్జెట్ ఫోన్ కూడా ఉండనుంది. ప్రీమియం ఫీచర్లతో మోడర్న్ లుక్ తో దీన్ని లాంచ్ చేయనున్నట్లు మైక్రోమ్యాక్స్ ప్రకటించడం విశేషం. ప్రస్తుతం మనదేశంలో చైనా వ్యతిరేక పవనాలు తీవ్రస్థాయిని చేరడంతో దీన్ని మైక్రోమ్యాక్స్ సద్వినియోగం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మైక్రోమ్యాక్స్ గతేడాది అక్టోబర్ మనదేశంలో ఆఖరి స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే మైక్రోమ్యాక్స్ ఐవన్ నోట్. దీని ధర రూ.8,199గా ఉంది.

మైక్రోమ్యాక్స్ త్వరలో లాంచ్ చేయబోయే మూడు ఫోన్లూ రూ.10 వేలలోపు ధరతోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు కూడా మైక్రోమ్యాక్స్ ట్వీటర్ లో సమాధానాలు ఇచ్చింది. చైనా ఫోన్లకు ప్రత్యామ్నాయంగా ఫోన్లను రూపొందించాల్సిందిగా వినియోగదారులు ట్వీటర్ లో కోరారు. అతి త్వరలో పెద్ద ప్రకటనతో వస్తామని ఈ సందర్భంగా మైక్రోమ్యాక్స్ తెలిపింది.

#MadeByIndian, #MadeForIndian హ్యాష్ ట్యాగ్ లను కూడా మైక్రోమ్యాక్స్ ఉపయోగించింది. వీటిని మనదేశంలోనే రూపొందించనుందా లేదా చైనాలో ఉన్న తయారుదారీ కంపెనీతో ఔట్ సోర్సింగ్ చేయిస్తుందా అనే విషయం తెలియరాలేదు. మైక్రోమ్యాక్స్ గతంలో చైనా ఫోన్లను రీబ్రాండ్ చేసి, మనదేశంలో విక్రయాలు జరిపేది. మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ యూ టెలివెంచర్స్ పేరిట ప్రత్యేక సబ్ బ్రాండ్ ను రూపొందించారు. ఈ బ్రాండ్ ద్వారా మొదట కూల్ ప్యాడ్ ఫోన్లను రీబ్రాండ్ చేసేవారు. తర్వాత కూల్ ప్యాడ్ తన ఫోన్లను ప్రత్యేకంగా మనదేశంలో లాంచ్ చేసింది.



Tags :
|

Advertisement