Advertisement

  • బులియ‌న్ మార్కెట్లో ప‌సిడి ప‌రుగులు కొన‌సాగుతున్నాయి

బులియ‌న్ మార్కెట్లో ప‌సిడి ప‌రుగులు కొన‌సాగుతున్నాయి

By: chandrasekar Thu, 17 Sept 2020 12:22 PM

బులియ‌న్ మార్కెట్లో ప‌సిడి ప‌రుగులు కొన‌సాగుతున్నాయి


గ‌త వారం కొంత మేర‌కు త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు ఈ వారం మ‌ళ్లీ పెరుగుతున్నాయి. బుధ‌వారం కూడా బులియ‌న్ ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఫ్లాట్‌గా ముగిసినా దేశీయ‌ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి.

కరోనా వైరస్‌ కేసులు ప్రబలడం, ఆర్థిక వ్యవస్థలు ఇప్పట్లో కోలుకునే అవ‌కాశం లేద‌నే అంచనాల నేప‌థ్యంలో చాలా మంది బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపారు.

ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి ధ‌ర 290 రూపాయలు పెరిగి రూ.52,059కి పెరిగింది. ఇక కిలో వెండి 61 రూపాయలు భారమై రూ.69,028 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అమెరికన్‌ ఫెడ్‌ నిర్ణయంపై ఇన్వెస్టర్లు వేచిచూసే ధోర‌ణి అవ‌లంభించ‌డంతో బంగారం కొనుగోళ్లపై ఆ ప్ర‌భావం ప‌డింది. వడ్డీరేట్లపై ఫెడరల్‌ రిజర్వ్‌ ఎలాంటి చర్యలు చేపడుతుందనే అంశం బంగారం ధరల తదుపరి దిశను నిర్ణయిస్తుందని బులియన్‌ నిపుణుల సమాచారం.

Tags :
|

Advertisement