Advertisement

  • భారీగా తగ్గిన బంగారం ధరలు ..వెండి ధర లో మాత్రం పెరుగుదల

భారీగా తగ్గిన బంగారం ధరలు ..వెండి ధర లో మాత్రం పెరుగుదల

By: Sankar Wed, 03 June 2020 09:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు ..వెండి ధర లో మాత్రం పెరుగుదల

భారత దేశంలో బంగారానికి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది ..భారత దేశం లో మహిళలకు బంగారం ఒక సెంటిమెంట్ ..అందుకే బంగారం రేట్ ఎంత పెరిగిన కూడా డిమాండ్ అలాగే ఉంటుంది..తాజాగా గత కొద్దీ రోజూలుగా పెరుగుతున్న బంగారం రేట్ ఈ రోజు తగ్గింది..అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర తగ్గిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి స్వల్పంగా పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బుధవారం పసిడి ధర పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర భారీగా దిగొచ్చింది. రూ.550 తగ్గుదలతో రూ.47,150కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మాత్రం రూ.50 పైకి కదిలింది. దీంతో ధర రూ.45,950కు చేరింది. ఇక కేజీ వెండి ధర పెరిగింది. రూ.10 పెరుగుదలతో రూ.50,160కు చేరింది.

gold,silver,10grams,kg,delhi,hyderabad ,బంగారం , వెండి , ఢిల్లీ, బులియన్ ,24 క్యారెట్

హైదరాబాద్ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 దిగొచ్చింది. దీంతో ధర రూ.45,070కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50 క్షీణించింది. దీంతో ధర రూ.49,170కు దిగొచ్చింది.

పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం స్వల్పంగా పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.10 పెరిగింది. దీంతో ధర రూ.50,160కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.


Tags :
|
|
|
|

Advertisement