Advertisement

  • ఎగుమతులు పెరిగి 27.4 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపిన వాణిజ్య శాఖ

ఎగుమతులు పెరిగి 27.4 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపిన వాణిజ్య శాఖ

By: chandrasekar Sat, 03 Oct 2020 4:00 PM

ఎగుమతులు పెరిగి 27.4 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపిన వాణిజ్య శాఖ


ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వల్ల ఎగుమతులు బాగా తగ్గాయి. కరోనా లాక్ డౌన్ వల్ల దేశంలో వరుసగా ఆరు నెలలుగా తగ్గుతూ వచ్చిన ఎగుమతులు సెప్టెంబర్‌లో పుంజుకున్నాయి. ఏడాది ప్రాతిపదికన 5.27 శాతం పెరిగి 27.4 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

రక రకాల దిగుమతులు ఇదే నెలలో 19.6 శాతం తగ్గి 30.31 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో వాణిజ్యలోటు 2.91 బిలియన్‌ డాలర్లకు దిగొచ్చింది. ఏడాది క్రితం ఇది 11.67 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది.

2020 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యకాలంలో ఎగుమతులు 21.43 శాతం తగ్గి 125.06 బిలియన్‌ డాలర్లకు పరిమితమవగా, దిగుమతులు 40.05 శాతం తగ్గి 148.69 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. ఎగుమతులు అధికమించడంవల్ల దేశం మంచి అభివృద్ధిని సాధించవచ్చు.

Tags :
|

Advertisement