Advertisement

కరోనా ప్రభావం....చిరు వ్యాపారస్థులకు కష్టమొచ్చింది

By: Dimple Fri, 17 July 2020 4:31 PM

కరోనా ప్రభావం....చిరు వ్యాపారస్థులకు  కష్టమొచ్చింది


చిన్న పిల్లలు నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఇష్టపడేది స్నాక్స్, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడు వాటికి కష్టకాలం వచ్చింది. సూపర్‌ మార్కెట్, కిరాణా దుకాణాల్లోనూ స్టాక్‌ లేక వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు బిస్కెట్లు, చాక్లెట్లు, వేపర్స్, చిప్స్, కార్న్‌ఫ్లేక్, కుర్‌కురే, పల్లీ చిక్కీలు, ఐస్‌క్రీమ్, నూడిల్స్, పాస్తా, చుడువా, సూప్స్, నమ్‌కిన్, గులాబి జామున్‌ తదితర స్నాక్, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ నిల్వలు నిండుకున్నాయి.

ఒక వైపు కరోనా లాక్‌ డౌన్‌ నేపథ్యంలో వినియోగదారులు ఇళ్లలో ఉండి కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం కోసం వీటిని ఎక్కువగా తింటున్నారు. దీంతో స్నాక్స్, ఇన్‌స్టంట్‌ ఫుడ్స్‌కు ఒకేసారి డిమాండ్‌ పెరిగింది. మరోవైపు లాక్‌డౌన్‌తో వాటి ఉత్పత్తి ఆగి సరఫరా లేకుండా పోయింది. ఈ కారణంగానే మార్కెట్‌లో ఇప్పుడు స్నాక్స్‌ కొరత ఏర్పడింది. తాజాగా ఇండస్ట్రీ సెక్టార్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ లభించినా..కార్మికుల కొరతతో డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి కావడం లేదు. దీంతో వాటి సరఫరా తగ్గుముఖం పట్టింది. స్నాక్స్, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌కు ఇండెంట్‌ ఆర్డర్స్‌ పెడితే...పెట్టిన దాంట్లో కనీసం 30 శాతం కూడా సరఫరా కాని పరిస్థితి నెలకొందని వ్యాపారులు, సూపర్‌ మార్కెట్ల మేనేజర్లు పేర్కొంటున్నారు

లోకల్‌ ఉత్పత్తులు

పెద్ద పెద్ద సంస్థలకు చెందిన స్నాక్స్, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ఉత్పత్తుల సరఫరా నిలిచిపోవడంతో కొంతమేర లోకల్‌ ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇక కొన్ని సూపర్‌ మార్కెట్స్‌ తమ సంస్థల పేర్లతో స్నాక్స్, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ తయారు చేసి అమ్మడం ప్రారంభించాయి. పేరొందిన సూపర్‌ మార్కెట్‌లు, స్థానిక చిన్న చిన్న సంస్ధలు సైతం సొంతంగా బిస్కెట్లు, చిప్స్, ఐస్‌క్రీమ్, నమ్‌కిన్, నూడుల్స్, సూప్స్‌ తదితర ఐటెమ్స్‌ను సొంతంగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వినియోగదారులు మాత్రం బ్రాండ్‌ ఉత్పత్తులపైనే ఆసక్తి కనబర్చుతున్నట్లు తెలుస్తోంది. కిరాణా దుకాణాల్లో మాత్రం పేద, మధ్య తరగతి వర్గాల నుంచి మాత్రం లోకల్‌ ఉత్పత్తులకు ఆదరణ బాగానే లభిస్తోంది.

Tags :
|
|
|

Advertisement