Advertisement

  • టిక్ టాక్ పాయే.. చింగారి వచ్చే ..గంటలో లక్ష మంది డౌన్లోడ్

టిక్ టాక్ పాయే.. చింగారి వచ్చే ..గంటలో లక్ష మంది డౌన్లోడ్

By: Sankar Tue, 30 June 2020 7:38 PM

టిక్ టాక్ పాయే.. చింగారి వచ్చే ..గంటలో లక్ష మంది డౌన్లోడ్



ఇండియాలో చాల మంది యువత ఏ పని చేయకుండా అయినా ఉండగలరు గాని టిక్ టాక్ వీడియోలో చేయకుండా మాత్రం ఉండలేరు ..వారి రోజువారీ కార్యకలాపాల్లో టిక్ టాక్ ఒక ముఖ్య భాగం అయింది ..అయితే కేంద్రం టిక్ టాక్ తో సహా 59 చైనా యాప్స్ ను నిషేదిస్తునట్లు ప్రకటించడంతో టిక్ టాక్ అభిమానులు షాక్ కు గురి అయ్యారు ..

అయితే ఇప్ప‌టికే ఈ యాప్‌ను భార‌త్‌లో దాదాపు 20 కోట్ల మంది వినియోగిస్తున్నారు. దీంతో ఉన్న‌ప‌లంగా తీసేయాలంటే ఇంకోటి రిప్లేస్‌ చేయాల్సిందే అనుకున్నారేమో వెంట‌నే టిక్‌టాక్ ప్ర‌త్యామ్నాయం ఏంటా అని శోధించారు. అదృష్ట‌వ‌శాత్తూ మ‌న భార‌తీయులు త‌యారు చేసిన 'చింగారి' యాప్ క‌ళ్లెదుట ప్ర‌త్య‌క్ష‌మయ్యింది. ఇంకేముంది గంటలోనే ఈ యాప్‌ను ల‌క్ష‌మంది దాకా డౌన్‌లోడ్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

షార్ట్ వీడియో స‌ర్వీస్‌తో అచ్చం టిక్‌టాక్ మాదిరే ఉన్న ఈ యాప్‌పై ప్ర‌స్తుతం భార‌తీయులు మ‌క్కువ చూపిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం భాష‌ల్లో ఈయాప్ అందుబాటులో ఉంది. దీంతో స్వ‌దేశీ ప‌రిఙ్ఞానంతో రూపొందింన 'చింగారి' యాప్‌ను ప్రోత్స‌హించాలంటూ ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

పారిశ్రామికవేత్త ఆనంద్ మ‌హింద్రా సైతం చింగారి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి దాని ప్ర‌త్యేక ఫీచ‌ర్స్‌ను వివ‌రించారు. స్వ‌దేశీ ప‌రిఙ్ఞానంతో రూపుదిద్దుకున్న చింగారి యాప్ రూప‌క‌ర్త‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. మ‌రో విశేషం ఏంటంటే ఆనంద్ మ‌హింద్రా ఇప్ప‌టివ‌ర‌కు టిక్‌టాక్ యాప్‌ను మునుపెన్న‌డూ డౌన్‌లోడ్ చేసుకోలేదు.

Tags :
|
|

Advertisement