Advertisement

చైనా కంపెనీ స్టోర్ల ముందు మేడిన్ ఇండియా లోగో

By: Sankar Fri, 26 June 2020 6:04 PM

చైనా కంపెనీ స్టోర్ల ముందు మేడిన్ ఇండియా లోగో


ఇండియా - చైనా మధ్య జరుగుతున్న సంఘర్షణల కారణంగా ఇండియాలో ఉన్న చైనా వస్తువులు మరియు కంపెనీల మీద ఆ ప్రభావం పడుతుంది ..ఆ ఘర్షణలో ఇరవై మంది భారతీయ సైనికులు అమరులు కావడంతో దేశం ఆగ్రహావేశాలు పెల్లుబికాయి..దేశంలో ఎక్కడ చుసిన మేడ్ ఇన్ ఇండియా అనే నినాదాలు వినిపిస్తున్నాయి

తాజాగా చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ తన రిటైల్ అవుట్‌లెట్లను ‘మేడిన్ ఇండియా’ లోగోలతో కవర్ చేసుకుంటోంది. చైనా -ఇండియా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వస్తువులపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. చైనా వస్తువులను బహిష్కరించాలంటూ దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమం మొదలవడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అఖిల భారత మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఏఐఎంఆర్ఏ) తెలిపింది.

చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలంటూ ఓ వర్గం పిలుపునిచ్చిన నేపథ్యంలో అసోసియేషన్ ఈమేరకు చైనా మొబైల్ బ్రాండ్లకు లేఖ రాసింది. అవుట్‌లెట్లపై దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సైన్ బోర్డలను బట్టతో కానీ, ఫ్లెక్సీతో కానీ మూసివేయాలని, లేదంటే స్టోర్ల ముందు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి ‘మేడిన్ ఇండియా’ బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాలని కోరినట్టు అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు అర్విందర్ ఖురానా తెలిపారు.

Tags :

Advertisement