Advertisement

కేంద్ర ప్రభుత్వం వెహికల్ రెంటల్ స్కీం ..?

By: Sankar Wed, 03 June 2020 4:40 PM

కేంద్ర ప్రభుత్వం వెహికల్ రెంటల్ స్కీం ..?

కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. కేంద్ర రోడ్డ రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ఒక అడ్వైజరీని విడుదల చేసింది. పరిశ్రమ వర్గాలు, ఇతరుల నుంచి తీసుకున్న సలహాలు, సూచనల ప్రామాణికంగా ఈ అడ్వైజరీని జారీ చేసింది. ఈ కొత్త పథకం పేరు ‘రెంట్ ఏ మోటార్ క్యాబ్/సైకిల్’.

కేంద్ర ప్రభుత్వపు మోటార్ సైకిల్ రెంట్ స్కీమ్ అమలుకు రోడ్డు మంత్రిత్వ శాఖ లైసెన్స్‌లు కూడా ఇవ్వనుంది. ఆపరేటర్లు ఈ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. అంతేకాకుండా వెహికల్ రెంట్‌కు తీసుకెళ్లే వారికి కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు అతను వెహికల్‌ను అద్దెకు తీసుకోవడం వీలవుతుంది. అంతే ఇక వెహికల్ మీద ఎలాంటి స్టిక్కర్లు ఉండవు


టూరిస్ట్‌లు, కార్పొరేట్ ఆఫీసర్లు, బిజినెస్ ట్రావెలర్స్, ఫ్యామిలీస్ వెకేషన్ కోసం ఈ స్కీమ్ కింద సులభంగా వెహికల్స్‌ను అద్దెకు తీసుకొని వెళ్లొచ్చు. టూవీలర్లు, సైకిల్, కార్లను రెంట్‌కు తీసుకెళ్లొచ్చు. ఈ స్కీమ్ వల్ల ట్యాక్సీ సర్వీసులకు పోటీ ఎదురయ్యే అవకాశముంది.

ఇకపోతే మోదీ సర్కార్ ఈ కొత్త స్కీమ్ వల్ల చాలా మంది ప్రజలకు ప్రయోజనం కలుగనుంది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లాలంటే వీటిని తీసుకొని సులభంగానే వెళ్లిపోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడికైనా వీటిని తీసుకెళ్లొచ్చు. మళ్లీ వాటిని తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి.




Tags :
|
|
|
|

Advertisement