Advertisement

ఇక నుంచి గ్యాస్ బుకింగ్ వాట్సాప్ లో

By: Sankar Tue, 02 June 2020 7:00 PM

ఇక నుంచి గ్యాస్ బుకింగ్ వాట్సాప్ లో

గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మిస్డ్ కాల్ ద్వారా సిలిండర్ బుక్ చేయొచ్చు. లేదంటే ఐవీఆర్ఎస్ విధానంలో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇప్పుడు గ్యాస్ బుకింగ్‌కు మరో ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.

దేశీ రెండో అతిపెద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ వాట్సాప్ గ్యాస్ బుకింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. బీపీసీఎల్‌కు దేశవ్యాప్తంగా 7 కోట్ల మందికి పైగా కస్టమర్లు ఉన్నాయి. వీరందరూ వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.

bpcl,gas,cylinder,petrolium corporation,whatsapp ,వాట్సాప్ , భారత్ పెట్రోలియం కార్పొరేషన్, గ్యాస్ బుకింగ్‌, సిలిండర్,  మిస్డ్ కాల్

గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని భావించే వారు 1800224344 నెంబర్‌కు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ నెంబర్‌కు పేమెంట్ లింక్ మెసేజ్ వస్తుంది. దీనిపై క్లిక్ చేసి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ ఇతర పేమెంట్ ఆప్షన్ల ద్వారా గ్యాస్ సిలిండర్ ధర చెల్లించాలి.

బీపీసీఎల్ కస్టమర్లు వాట్సప్ ద్వారా భారత్ గ్యాస్ బుక్ చేయడానికి ముందుగా బీపీసీఎల్ స్మార్ట్‌లైన్ నెంబర్‌ అయిన 1800224344 ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత హాయ్ అని మెసేజ్ చేయాలి. అటుపైన బుక్ లేదా 1 అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఇందులోనే పేమెంట్ లింక్ కూడా ఉంటుంది.

Tags :
|
|

Advertisement