Advertisement

స్నేహితుడికోసం కేక్‌ చేసిన బిల్‌ గేట్స్‌

By: Dimple Tue, 01 Sept 2020 00:16 AM

స్నేహితుడికోసం కేక్‌ చేసిన బిల్‌ గేట్స్‌

ప్రపంచంలోని అన్ని బంధాల్లో స్నేహ బంధం గొప్పదంటారు. తల్లదండ్రులకు కూడా చెప్పుకోలేని ఎన్నో విషయాలను కేవలం స్నేహితుల దగ్గరే చెప్పుకుంటాం. స్నేహానికి వయసుతో సంబంధం లేదు. అలాంటి స్నేహితుల పుట్టిన రోజు వస్తే ఖచ్చితంగా ఎదో ఒక బహుమతి ఇవ్వాల్సిందే.. ఆ బహుమతి విలువ దాని ఖరీదును బట్టి కాకుండా ఇచ్చే స్వచ్చమైన మనుసును బట్టి ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన స్నేహితుడికి సరికొత్తగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా.. మైక్రోసాప్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్.. అవును తన స్నేహితుడు, ప్రపంచ కుబేరుడు వారెన్‌ బఫెట్‌ ఆదివారం తన 90వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌ తన స్నేహితుడి కోసం స్వయంగా కేకును తయారు చేసి వారెన్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ ఓ చక్కటి కేక్‌ను స్వయంగా తయారు చేశారు. తాను ఆరాధించే ఓ వ్యక్తి కోసం ఈ కేక్‌ను చేసినట్టు గేట్స్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకొన్నారు. అంతేకాకుండా కేక్‌ తయారీ వీడియోను కూడా పోస్టు చేశారు. ఆగస్టు 30న మరో దిగ్గజ వ్యాపారవేత్త, బిల్‌ గేట్స్‌ స్నేహితుడైన వారెన్‌ బఫెట్‌ 90వ జన్మదినం. తన మిత్రుడు బఫెట్‌కు ప్రత్యేక బహుమతిగా ఆయన ముఖం కనిపించేలా కేక్‌ తయారుచేసి.. తన పాకశాస్త్ర ప్రావీణ్యం ప్రదర్శించారు.

వారెన్‌కు 30 ఏళ్ల యువకుడి మాదిరి సునిశిత మానసిక సామర్థ్యం ఉంది. ఆయన అల్లరి నవ్వు పదేళ్ల పిల్లాడిలా ఉంటుంది.. ఇక ఆయన ఆహారమేమో ఆరేళ్ల పిల్లాడిలా ఉంటుంది. ఆయన ఆహార నియమాలకు అనుగుణంగా నేను చేసిన బర్త్‌డే కేక్‌ వీడియో ఇదిగో..’’ అంటూ బిల్‌ గేట్స్‌ షేర్‌ చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ బిల్‌గేట్స్‌ కేక్‌ను ఎలా తయారుచేశారా..? అనే కుతూహలంతో ఇప్పటికే 15 లక్షల మందికి పైగా వీక్షించిన ఈ వీడియోను మీరూ చూసేయండి..

Tags :
|
|

Advertisement