Advertisement

Bad News: భారీగా పెరిగిన బంగారం ధర...!

By: Anji Sat, 05 Dec 2020 4:23 PM

Bad News: భారీగా పెరిగిన బంగారం ధర...!

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి.

కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రికార్ఢ్ స్థాయిలో రూ. 50 వేలు దాటిపోయింది. మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి.

అయితే… తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటి రోజున బంగారం ధరలు స్వల్పంగా పెరగగా.. ఈరోజు భారీగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరగడంతో రూ. 52,640 కు పలుకుతోంది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 48,260 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరగడంతో రూ. 50,290 కు చేరింది.

అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరగడంతో రూ. 46,100 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే రూ. 200 పెరగడంతో రూ.67,500 కు చేరుకుంది.

Tags :

Advertisement