Advertisement

SBI బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్...!

By: Anji Mon, 12 Oct 2020 7:15 PM

SBI బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్...!

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు అకౌంట్ ఉందా? అయితే మీకు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ యోనో యాప్ సర్వీసులు స్తంభించిపోనున్నాయి. రెండు రోజుల పాటు స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు యోనో యాప్ సర్వీసులు అందుబాటులో ఉండవు. మెయింటెనెన్స్‌లో భాగంగా యోనో యాప్ సర్వీసులు అందుబాటులో ఉండవని స్టేట్ బ్యాంక్ తెలిపింది.

ఈ అంశానికి సంబంధించి ట్వీట్ కూడా చేసింది. అక్టోబర్ 11, అక్టోబర్ 13 తేదీల్లో బ్యాంక్ యోనో యాప్ పని చేయదు. ఇప్పటికే అక్టోబర్ 11 అయిపోయింది. ఇక అక్టోబర్ 13 అంటే రేపు యోనో యాప్ సర్వీసులు అందుబాటులో ఉండవు. అయితే కేవలం ఉదయం 12 గంటల నుంచి 4 గంటల మధ్యలో యోనో యాప్ పని చేయదు.

యోనో యాప్ సర్వీసులు అందుబాటులో ఉండవని, అందువల్ల బ్యాంక్ కస్టమర్లు దీనికి అనుగుణంగా వారి బ్యాంకింగ్ కార్యకలాపాలను సెట్ చేసుకోవాలని ఎస్‌బీఐ కోరింది. ఎస్‌బీఐ యోనో వాడే వారు ప్రత్యామ్నాయంగా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా సేవలు పొందొచ్చని తెలిపింది.

ఇకపోతే ఎస్‌బీఐ ఇటీవలే కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ యోనో యాప్ వాడే వారికి ఇది ఉపయోగపడుతుంది. యోనో యాప్ ఉపయోగించే వారు యాప్‌లోకి లాగిన్ అవ్వకుండానే బ్యాంక్ బ్యాలెన్స్, పాస్ బుక్ వంటి సేవలు పొందొచ్చు.

Tags :

Advertisement