Advertisement

  • జీఎస్టీ తగ్గింపు వార్తలతో దూసుకుపోతున్న ఆటో రంగ షేర్లు

జీఎస్టీ తగ్గింపు వార్తలతో దూసుకుపోతున్న ఆటో రంగ షేర్లు

By: Sankar Wed, 26 Aug 2020 4:18 PM

జీఎస్టీ తగ్గింపు వార్తలతో దూసుకుపోతున్న ఆటో రంగ షేర్లు


ద్విచక్ర వాహనాలపై పన్ను తగ్గించాలంటూ ఆటో పరిశ్రమ చేస్తున్న వినతులను పరిశీలించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్న నేపథ్యంలో ఆటో రంగ కౌంటర్లు జోరందుకున్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) 28 శాతంగా అమలవుతోంది.

ద్విచక్ర వాహనాలు.. అటు విలాసవంత(లగ్జరీ) కేటగిరీలోకి లేదా ఇటు డీమెరిట్‌లోకీ రావని సీతారామన్‌ వ్యాఖ్యానించారు. దీంతో జీఎస్‌టీ కౌన్సిల్‌ ద్విచక్ర వాహనాలపై పన్ను తగ్గింపునకు వీలుగా సవరణలు చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి హామీనిచ్చారు. పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సభ్యులతో నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో భాగంగా నిర్మలా సీతారామన్‌ ఈ విషయాలను ప్రస్తావించారు.

కాగా.. గురువారం జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంకానున్నప్పటికీ సెప్టెంబర్‌ 17న నిర్వహించనున్న సమావేశంలో ద్విచక్ర వాహన పన్ను తగ్గింపును చేపట్టవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఆటో రంగ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఆటో రంగ ఇండెక్స్‌ దాదాపు 2 శాతం ఎగసింది.

Tags :
|
|
|
|
|

Advertisement