Advertisement

5,237 కోట్ల నష్టాలలో ఎయిర్‌టెల్‌ 2.75 శాతం వాటావిక్రయం

By: chandrasekar Tue, 26 May 2020 2:52 PM

5,237 కోట్ల నష్టాలలో ఎయిర్‌టెల్‌ 2.75 శాతం వాటావిక్రయం


భారతీ ఎయిర్‌టెల్‌ ప్రమోటరైన భారతీ టెలిమీడియా మంగళవారం బ్లాక్‌డీల్‌ ద్వారా దాదాపు 100 కోట్ల డాలర్ల విలువైన ఎయిర్‌టెల్‌ షేర్లను విక్రయించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్లాక్‌డీల్‌లో భాగంగా 2.75 శాతం వాటాను టెలిమీడియా విక్రయించనుంది. ఈ డీల్‌కు జేపీమోర్గాన్‌ బ్యాంకర్‌గా వ్యవహరించనుందని, డీల్‌లో భాగంగా ఒక్కో షేరును రూ. 558 చొప్పున విక్రయించనున్నట్లు తెలిసింది. ఈ ధర శుక్రవారం ముగింపు ధర కన్నా దాదాపు 6 శాతం తక్కువ. డీల్‌లో భాగంగా సుమారు 15కోట్ల షేర్లు చేతులు మారతాయి. విక్రయానంతరం ప్రమోటర్లకు 90 రోజుల లాక్‌ఇన్‌ వర్తించనుంది. విక్రయం ద్వారా వచ్చిన నిధులను అమ్ములు తీర్చేందుకు వినియోగిస్తారని సదరు వర్గాలు తెలిపాయి. డీల్‌ పూర్తయితే ఎయిర్‌టెల్‌లో ప్రమోటర్లైన భారతీ టెలికం, ఇండియన్‌ కాంటినెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, వృందావన్‌, పాస్టెల్‌ కంపెనీల వాటా 58.98 శాతం నుంచి 56.23 శాతానికి తగ్గనుంది. గత మూడేళ్లుగా ఎయిర్‌టెల్‌ వివిధ మార్గాలు వేగంగా నిధుల సమీకరణలు జరిపింది. అనంతరం ఏజీఆర్‌ రూపంలో ఎదురుదెబ్బ తగిలినా, టారిఫ్‌లు పెంచడం ద్వారా నిలదొక్కుకుంది.

airtel,percent,stake,loss,crore ,కోట్,ల నష్టాలలో, ఎయిర్‌టెల్‌, శాతం, వాటావిక్రయం


ఈ ‌కంపెనీకి ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌కు రూ.5,237 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. వన్‌టైమ్‌ స్పెక్ట్రమ్‌ చార్జీలకు సంబంధించి తాజా తీర్పు కారణంగా రూ.7,004 కోట్లు చెల్లించడంతో ఈ నష్టాలు ఈ స్థాయిలో పెరిగాయని కంపెనీ తెలిపింది. గత ఏడాది మార్చి క్వార్టర్‌లో రూ.107 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం రూ.20,602 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.23,723 కోట్లకు పెరిగింది. ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి (ఏఆర్‌పీయూ) రూ.123 నుంచి రూ.154కు పెరిగింది. ఈ కంపెనీ గత ఏడాది డిసెంబర్‌లోటెలికం సేవల ధరలను పెంచింది. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ 2.6 శాతం నష్టంతో రూ.540 వద్ద ముగిసింది.

Tags :
|
|
|

Advertisement