Advertisement

బేకింగ్ సోడాతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి ..

By: Sankar Wed, 08 July 2020 3:30 PM

బేకింగ్ సోడాతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి ..



బేకింగ్ సోడా.. వంటల్లో వాడే దీనిని ఎన్నో రకాలుగా వాడొచ్చు. ఇందులో చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి.

దీనిని వాడడం వల్ల చర్మ వ్యాధుల నుంచి బయటపడొచ్చు.బేకింగ్ సోడాతో స్నానం చేసే నీటిలో వేసి 30 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే చర్మకణాలు పాతవి పోయి.. కొత్తగా వస్తాయి. అంతేకాకుండా శరీరం నుంచి వచ్చే దుర్వాసన కూడా పోతుంది..

కొన్ని సార్లు ఎండకు ఎక్కువగా చర్మం కందిపోయి ఎర్రగా మారుతుంది. అలాంటప్పుడు చిన్న కప్పులో బేకింగ్ సోడా వేసి నీటితో కలిపి పేస్టులా చేయాలి.. దానిని చర్మంపై రాసి ఆరిన తర్వాత మెల్లిగా స్క్రబ్ చేస్తూ దానిని క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మళ్లీ మెరుస్తుంది..

అదే విధంగా.. ముఖం అప్పటికప్పుడే మెరవాలంటే.. బేకింగ్ సోడాని నీటిలో కలిపి పేస్టులా చేసి అందులో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు వేసి ముఖంపై పూతలా వేయండి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడగండి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

పావు గ్లాసు నీళ్లలో, ఒక టీ స్పూను బేకింగ్‌ సోడా కలిపి రోజూ క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే.. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకులు తొలిగిపోతాయి అంటున్నారు నిపుణులు. దీని వల్ల గుండె సమస్యలు వచ్చే వేధించే శాతం తగ్గుతుంది.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సమస్యలు ఉన్నవారు ఇలా చేయడం వల్ల మేలు జరుగుతుంది.

చాలా మంది మొటిమలు, మచ్చలతో బాధపడుతుంటారు. అలాంటప్పడు బేకింగ్ సోడా నీటిని ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత మెల్లిగా స్క్రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే సమస్య తగ్గిపోతుంది..

Tags :
|
|

Advertisement