Advertisement

వాల్నట్ ఆయిల్ తో జుట్టుకు అనేక అద్భుత ప్రయోజనాలు

By: Sankar Sun, 30 Aug 2020 10:56 AM

వాల్నట్ ఆయిల్ తో జుట్టుకు అనేక అద్భుత ప్రయోజనాలు


ఈ మధ్యకాలంలో చాలా మంది హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారు. జుట్టు వాల్యూం తగ్గిపోవడం, లేదా డాండ్రఫ్, లేదా ఇంకేదైనా హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. కాబట్టి, నేచురల్ పదార్థాలతో రెమెడీ తయారుచేసుకోవడం ఎంతో అవసరం. ఈరోజు అటువంటి ఒక ఆయిల్ గురించి మనం తెలుసుకుందాం. అదే వాల్నట్ ఆయిల్. ఈ ఆయిల్ లో ఎన్నో థెరపీటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి హెయిర్ కేర్ కు ఇది పెర్ఫెక్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు.

1. వాల్నట్ ఆయిల్ లో హెయిర్ కేర్ విటమిన్స్ ముఖ్యంగా బయోటిన్ లభ్యమవుతుంది. ఇది హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తుంది. ఇందులో సెలీనియం లభిస్తుంది. ఈ మినరల్ లోపం వల్ల హెయిర్ లాస్ సమస్య ఎదురవుతుంది. కాబట్టి, వాల్నట్ అనేది ఈ మినరల్ లోపాన్ని భర్తీ చేస్తుంది. దాంతో, హెయిర్ లాస్ సమస్యను నివారిస్తుంది. భయంకరమైన హెయిర్ ఫాల్ ను ఎక్స్పీరియెన్స్ చేస్తున్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆయిల్ లో పొటాషియం ఉంటుంది. ఇది హెయిర్ కు వాల్యూమ్ అందిస్తుంది. రూట్స్ ను బలపరుస్తుంది.

2. ఈ ఆయిల్ విపరీతమైన హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తుంది. వాల్నట్ ఆయిల్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. వాల్నట్స్ లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి స్కాల్ప్ డేమేజ్ ను అలాగే ఇన్ఫెక్షన్స్ ను అరికడతాయి. స్కాల్ప్ హెల్త్ ను ఇంప్రూవ్ చేయడంలో ఈ ఆయిల్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. తద్వారా, హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తుంది.

3. ఈ ఆయిల్ రెమెడీని పాటించిన తరువాత పెరిగే హెయిర్ చాలా స్ట్రాంగ్ గా అలాగే థిక్ గా ఉంటుంది. జుట్టు పలచబడే సమస్యను ఈ ఆయిల్ రెమెడీ తగ్గిస్తుంది. హెయిర్ బ్రేకింగ్ సమస్య కూడా తగ్గుతుంది. హెయిర్ కు మంచి పోషణ లభిస్తుంది.

4. రోజూ గుప్పెడు వాల్నట్స్ ను తినడం ద్వారా కూడా హెయిర్ లాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. పొడవాటి ఆరోగ్యకరమైన శిరోజాలను కలలోనే కాదు ఇలలో కూడా పొందవచ్చు.

5. వాల్నట్స్ తో మీరు కెమికల్ ఫ్రీ హెయిర్ కలర్ ను కూడా తయారుచేసుకోవచ్చు. ఇది మీ హెయిర్ ను డేమేజ్ చేయదు. వాల్నట్ షెల్ తో హెయిర్ కలర్ ను సింపుల్ గా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు

Tags :
|
|
|

Advertisement