Advertisement

ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన ఉపయోగాలు

By: Sankar Tue, 23 June 2020 1:00 PM

ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన ఉపయోగాలు





ఆషాడ మాసం రాగానే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఆడపిల్లలను గోరింటాకు పెట్టుకోమని చెప్తారు ..పెళ్లి అయినా అమ్మాయిలను అయితే తప్పనిసరిగ పెట్టుకోవాలని సూచిస్తారు ..మరి ఆషాడంలో గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలా , గోరింటాకు పెట్టుకోవడం వలన కలిగే లాభాలు ఏమిటి అనేది చూదాం ..

ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. వర్షాల వల్ల సూక్ష్మక్రిములు పెరిగి, అంటు రోగాలు వ్యాపించడం పరిపాటీ. ఎందుకంటే వర్షాలు పడటం వలన వాతవరణం చల్లబడుతుంది. కాని ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బైట వాతవరణానికి సమానంగా మన శరీరం మారకపోవడం వలన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.గోరింటాకుకు శరీరంలోని వేడి తగ్గించే గుణం, రోగ నిరోధిక శక్తిని పెంచి, రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు ఈ మాసంలో తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. నిజానికి గోరింటాకును లోగడ మగవాళ్ళ కూడా పెట్టుకునే వారు.అయితే తర్వాత కాలంలో కేవలం ఆడవారు పెట్టుకుంటున్నారు ..ఆడవారు గోరంటాకును పెట్టుకోవడం వలన గోళ్ళు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఆడవారు ఎక్కువగా డిటర్జంట్స్, సర్ఫులను వాడటం వలన గోళ్ళలో నీరు చేరుతుంది. గోరంటాకును పెట్టుకోవడం ద్వారా దీనిని నివారించ వచ్చు. ఆడవారు గోరింటాకు పెట్టుకోవడం వలన ముత్తయిదవతనంతో వర్థిల్లుతారని విశ్వాసం.

ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని,పెట్టుకున్న గోరింటాకు ఇచ్చే రంగును చూసుకుని మురిసిపోతూ వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న , మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తారు ..అందుకే కొత్తగా పెళ్లి అయినా ఆడవారిని ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకొమ్మని పెద్దవాళ్లు చెప్తారు ..గోరింటాకు పెట్టుకోవడం వలన ఆ చేతికి ఎర్రగా అందం కూడా వస్తుంది ..అందుకే మహిళలు ఎక్కువగా గోరింటాకు పెట్టుకునేందుకు ఆసక్తి చూయిస్తారు ..

Tags :
|
|
|

Advertisement