Advertisement

కాటుక కండ్లను మెరిసేలా చేస్తుంది

By: chandrasekar Thu, 23 July 2020 6:39 PM

కాటుక కండ్లను మెరిసేలా చేస్తుంది


మంగళ ద్రవ్యమైన కాటుక ధారణ సుమంగళత్వాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు చెబుతారు. కాటుక కంటికి చలువ చేస్తుందని ఆయుర్వేదమూ చెబుతున్నది. కాటుక ఎండ, దుమ్ము, ధూళి ప్రభావాల నుంచి కంటిని కాపాడటమేకాకుండా కండ్లను తాజాగా, మెరిసేలా చేస్తుంది. కాటుక ఉపయోగించేటప్పుడు కొన్నిఅంశాలను పరిగణలోకి తీసుకొంటే కండ్లు మరింత అందంగా కనిపిస్తాయి. నాణ్యమైన కాటుక వాడాలి. కాటుక వాడినప్పుడు దురద పెట్టటం, కళ్ళు మంటగా అనిపిస్తే వెంటనే కాటుక వాడటం ఆపాలి. ఎక్కువగా చెమట పెట్టే చర్మంగలవారు, ఉక్కపోతగా ఉన్నప్పుడు కాటుక పెట్టుకునేవారు ముఖాన్ని ఐస్‌ ముక్కలతో మర్దన చేసుకోవాలి.

the bite,makes,the eyelids,glow,cold ,కాటుక, కండ్లను, మెరిసేలా, చేస్తుంది, కనులు


దీనివల్ల చెమట పట్టడం తగ్గి తద్వారా పెట్టిన కాటుక చెదరకుండా ఉంటుంది.కాటుక పెట్టుకొనే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని కండ్లపై తడిలేకుండా తుడుచుకోవాలి. కాటుక పెట్టుకునే ముందు మెత్తని వస్త్రంతో కనురెప్పను తుడుచుకోవాలి. దీనివల్ల కనురెప్పలపై ఉండే జిడ్డు పూర్తిగా తొలగిపోతుంది. లేదా కొద్దిగా పౌడర్‌ కళ్ల చుట్టూ రాస్తే చర్మంపై ఉండే జిడ్డుని పౌడర్‌ పీల్చుకొని కళ్లు తాజాగా ఉంటాయి. కనురెప్పల కోన భాగం వరకు కాటుక పెట్టుకొంటే కనులు చాలా అందంగా ఉంటాయి.

Tags :
|
|

Advertisement