Advertisement

చర్మ ఆరోగ్యాన్ని కాపాడే రోజ్ వాటర్

By: chandrasekar Sat, 04 July 2020 2:47 PM

చర్మ ఆరోగ్యాన్ని కాపాడే రోజ్ వాటర్


రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ధర కూడా అందుబాటులోనే ఉండడంతో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో రోజ్ వాటర్ తర్వాతే మరేదైనా. రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా కూడా మారుస్తుంది. నిగారింపుని తెస్తుంది. రోజ్ వాటర్ ఇంట్లో ఉంటే చాలు ఖరీదైనా టోనర్లు, సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములతో అవసరమే ఉండదు.

* రోజంతా బయటి పనులతో మనమూ, మనతో పాటూ చర్మం కూడా కాంతి విహీనంగా మారుతుంది. బోలెడంత కాలుష్యం ముఖానికి అంటుకుంటుంది. ఫేస్‌వాష్ చేసుకున్నా సరే ఈ మురికి వదలదు. ఇంటికెళ్లాక ముఖాన్ని శుభ్రం చేసుకుని.. కాస్త రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ఫేస్‌ను తుడవండి. చర్మంపై పేరుకున్న వ్యర్థాలన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖం కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

* రోజ్ వాటర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్లకింద నల్లటి వలయాలు ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. గులాబీ నీళ్లలో ముంచి దూదిని కళ్ల కింద తరచూ పెట్టుకుంటే ఆ వలయాలు మాయమవుతాయి.

rosewater,best,skin,health,glowing ,చర్మ, ఆరోగ్యాన్ని, కాపాడే, రోజ్, వాటర్


* తలలో చుండ్రు తగ్గాలంటే తలకి స్నానం చేశాక ఓ మగ్గు నీటిలో రోజ్ వాటర్ కలిపి మాడుకి తగిలేలా పోసుకోవాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

* ఎండలో బాగా తిరిగితే చాలు ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది. అలాంటప్పుడు రోజ్ వాటర్‌లో కీరదోస రసం, గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమంలో దూది ముంచి మొత్తం శుభ్రం చేయాలి. ట్యాన్ పోతుంది.

* తలలో చుండ్రు తగ్గాలంటే తలకి స్నానం చేశాక ఓ మగ్గు నీటిలో రోజ్ వాటర్ కలిపి మాడుకి తగిలేలా పోసుకోవాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

* మొటిమలున్న వారు రోజూ రోజ్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మంచిది.

Tags :
|
|
|

Advertisement