Advertisement

చర్మ సౌందర్యాన్ని మెరిపించే రోజ్ వాటర్ ఉపయోగాలు

By: Sankar Sun, 05 July 2020 6:37 PM

చర్మ సౌందర్యాన్ని మెరిపించే రోజ్ వాటర్ ఉపయోగాలు



అందంగా కనిపించాలని కోరుకోని అమ్మాయిలు ఉండరు ..అయితే బయట తిరగడం వలన చర్మం బాగా కందిపోతుంది ..అయితే చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో రోజ్ వాటర్ తర్వాతే మరేదైనా. రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా కూడా మారుస్తుంది. నిగారింపుని తెస్తుంది. రోజ్ వాటర్ ఇంట్లో ఉంటే చాలు.. ఖరీదైనా టోనర్లు, సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములతో అవసరమే ఉండదు. రోజ్ వాటర్ ను వలన చర్మం ఎలా నిగారిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ..

1. రోజంతా బయటి పనులతో మనమూ, మనతో పాటూ చర్మం కూడా వడలిపోతుంది. బోలెడంత కాలుష్యం ముఖానికి అంటుకుంటుంది. ఫేస్‌వాష్ చేసుకున్నా సరే.. ఈ మురికి వదలదు. ఇంటికెళ్లాక ముఖాన్ని శుభ్రం చేసుకుని.. కాస్త రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ఫేస్‌ను తుడవండి. చర్మంపై పేరుకున్న వ్యర్థాలన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖం కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

2. ఎండలో బాగా తిరిగితే చాలు ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది. అలాంటప్పుడు రోజ్ వాటర్‌లో కీరదోస రసం, గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమంలో దూది ముంచి మొత్తం శుభ్రం చేయాలి. ట్యాన్ పోతుంది.

3. రోజ్ వాటర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్లకింద నల్లటి వలయాలు ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. గులాబీ నీళ్లలో ముంచి దూదిని కళ్ల కింద తరచూ పెట్టుకుంటే ఆ వలయాలు మాయమవుతాయి.

4. తలలో చుండ్రు తగ్గాలంటే తలకి స్నానం చేశాక ఓ మగ్గు నీటిలో రోజ్ వాటర్ కలిపి మాడుకి తగిలేలా పోసుకోవాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

5. మొటిమలున్న వారు రోజూ గులాబీనీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మరవద్దు.

6. ప్రస్తుతం ఎక్కువ మంది లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఎక్కువ సమయాన్ని టీవీ, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్, కంప్యూటర్స్ ముందు టైమ్ స్పెండ్ చేస్తున్నారు. దీంతో కళ్ళు అలసిపోతాయి. ఇలాంటి సమస్యకి రోజ్ వాటర్ చక్కని పరిష్కారం. దీని కోసం మీరు చేయాల్సింది. మీ కళ్ళపై కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి 10 నిమిషాలు మూసుకోండి. ఇలా చేస్తే కళ్ళు రిలాక్స్ అవుతాయి.

Tags :
|
|

Advertisement