Advertisement

  • చర్మాన్ని ప్రకాశవంతంగా ఉండేలా చేయగల రైస్ - మిల్క్ సీరం తయారీవిధానం

చర్మాన్ని ప్రకాశవంతంగా ఉండేలా చేయగల రైస్ - మిల్క్ సీరం తయారీవిధానం

By: chandrasekar Thu, 10 Sept 2020 2:50 PM

చర్మాన్ని ప్రకాశవంతంగా ఉండేలా చేయగల రైస్ - మిల్క్ సీరం తయారీవిధానం


కావలసిన పదార్ధాలు:

* బియ్యం: రెండు టేబుల్ స్పూన్లు

* అలోవేరా జెల్: ఒక స్పూన్

* రోజ్ వాటర్: ఒక స్పూన్

* నీళ్ళు: ఒక కప్పు

* పాలు: ఒక స్పూన్

* ఆలివ్ ఆయిల్: అర స్పూన్

* కొబ్బరి నూనె: అర స్పూన్

* గ్లిజరిన్: అర స్పూన్

తయారుచేసే విధానం :


ఒక గిన్నె లో బియ్యాన్ని తీసుకుని, అందులో నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఈ నానబెట్టిన బియ్యం తీసుకుని, అందులో నీళ్ళు పోసి మరగనివ్వండి. ఇప్పుడు అందులో పాలు పోయండి. స్టౌని సిం లో ఉంచి, తాజా అలోవేరా జెల్ అందులో వేసి మిక్స్ చేయండి. 15 నుండి 20 నిమిషాల పాటు, అలాగే సిం మీద ఉంచి కలుపుతూ మరగనివ్వండి. పచ్చిపాలలో యాంటీ ఆక్సిడెంట్స్, B విటమిన్, ఆల్కా హైడ్రాక్సీ యాసిడ్స్, కాల్షియం వంటివి ఉంటాయి. ఇవి చర్మ సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇవి మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతాయి. ఒకవేళ మీరు ఆక్నే సమస్యతో బాధపడుతున్నట్లయితే, మీ చర్మాన్ని ఇది ఎక్స్ఫోలియేట్ చేసి ఆక్నే సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఫిల్టర్ చేసి, ఒక చిన్నపాటి కంటైనర్లోనికి తీసుకోండి. రైస్ వాటర్ చర్మంలోని కొల్లాజన్ స్థాయిలను పెంచుతుంది. క్రమంగా ఇది ముడతలను అడ్డుకుంటుంది. దీనిలో ఉండే సన్ స్క్రీన్ గుణాలు యాంటీ ఏజింగ్ వలె పనిచేస్తాయి.


ఫిల్టర్ చేసిన మిశ్రమంలో రోజ్ వాటర్ ఒక టీస్పూన్, అర టీస్పూన్ కొబ్బరి నూనె, అర టీస్పూన్ ఆలివ్ ఆయిల్, అర టీస్పూన్ గ్లిజరిన్ వేసి మిక్స్ చేయండి. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా, చర్మం మీద ఉన్న హానికర బ్యాక్టీరియాతోపాటు, ఆక్నే సమస్యను తొలగిస్తుంది. గ్లిజరిన్ చర్మం నుండి మాయిశ్చర్ పోకుండా కాపాడుతుంది. ఇప్పుడు ఇందులో టీస్పూన్ అలోవేరా జెల్ వేసి బాగా మిక్స్ చేయండి. అంతే రైస్ - మిల్క్ సీరం రెడీ. దీనిని 3 రోజుల పాటు రూమ్ టెంపరేచర్లో నిల్వ చేసుకోవచ్చు. వీలయితే రిఫ్రిజిరేటర్లో కూడా స్టోర్ చేయవచ్చు. ఈ రైస్ - మిల్క్ సీరం సమ్మర్లో చర్మాన్ని సూర్యరశ్మి నుండి కాపాడుతూ, ప్రకాశవంతంగా ఉండేలా చేయగలదు. అంతేకాకుండా యవ్వనంగా కనిపించేలా ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. ఈ సీరం ఎటువంటి చర్మానికైనా సరిపోతుంది. నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, అసాధారణ స్కిన్ టోన్ తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

Tags :
|

Advertisement