Advertisement

చుండ్రు నివారణకు సహజ చిట్కాలు ..

By: Sankar Fri, 17 July 2020 12:13 PM

చుండ్రు నివారణకు సహజ చిట్కాలు ..



వర్షాకాలం మరియు చలికాలంలో బాగా ఇబ్బంది పెట్టె సమస్యలో ఒకటి చుండ్రు ..ఎన్ని రకాల షాంపూలు వాడిన చుండ్రు సమస్య అలాగే ఉంటుంది ..ఆ షాంపూలు వాడటం వలన జుట్టుకు కూడా అంతగా మంచిది కాదు ..అందుకే చుండ్రు నివారణకు నాచ్యురల్ గా దొరికే వాటితోనే ఎలా తగ్గించుకోవచో ఇపుడు చూదాం..

1. వేపాకులతో చుండ్రును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. దురదను తగ్గించడమే కాదు.. డాండ్రఫ్ పెరగడానికి కారణమయ్యే ఫంగస్‌ పెరుగుదలను కూడా వేపాకు అరికడుతుంది. రెండు గుపిళ్ల నిండుగా వేపాకు తీసుకొని 4-5 కప్పుల వేడి నీటిలో వేసి రాత్రంతా అలా వదిలేయండి. మరుసటి రోజు ఉదయం ఆ నీటితో తలను కడిగేసుకోండి. మిగిలిపోయిన వేపాకులను పేస్ట్‌గా చేసుకొని మాడుకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేసినా ఫలితం ఉంటుంది..

2. ఆపిల్ సీడర్ వెనిగర్‌తోనూ చుండ్రును అరికట్టవచ్చు. ఫంగస్‌ను నాశనం చేయడంలో ఇది ఎంతో ఉపకరిస్తుంది. ఇందుకోసం వెనిగర్, నీటిని సమపాళ్లలో కలపాలి. దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు. ఇలా కొద్ది రోజులపాటు చేయడం వల్ల డాండ్రఫ్‌ను కూడా అరికట్టవచ్చు.

3. కొబ్బరి నూనెతోనూ డాండ్రఫ్‌ను తరిమేయొచ్చు. కాకపోతే దీనికి టీ ట్రీ ఆయిల్‌ను కలపాల్సి ఉంటుంది. ప్రతి ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకు 5 - 10 చుక్కల స్వచ్ఛమైన టీ ట్రీ ఆయిల్ కలపాలి. తర్వాత దాన్ని మాడుకు పట్టించడం వల్ల చుండ్రుకు కారణమైన ఫంగస్ నశిస్తుంది.

4. తాజా నిమ్మరసంలోని యాసిడ్లు చుండ్రును కలిగించే ఫంగస్‌ను నాశనం చేస్తాయి. నిమ్మరసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నుంచి మంచి పరిమళం కూడా వస్తుంది. నిమ్మరసాన్ని మాడుకు పట్టించి ఒక నిమిషంపాటు వదిలేయాలి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది. డాండ్రఫ్ తగ్గే వరకూ రోజూ ఇలా చేయాలి.

5. పులిసిన పెరుగును మాస్క్‌గా వేసుకోవడం వల్ల కూడా డాండ్రఫ్ తగ్గుముఖం పడుతుంది. ఇందుకోసం పెరుగును తలకు పట్టించి గంటపాటు అలా వదిలేయాలి. తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో కడిగేసుకోవాలి. ఫలితంగా చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు మృదువుగా మారుతుంది.

Tags :
|
|

Advertisement