Advertisement

దంత సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు

By: chandrasekar Sat, 20 June 2020 7:45 PM

దంత సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు


చిరునవ్వు అనేది మనిషిలోని ఆనందాన్ని ఇతరులకు చూపుతుంది. చిరునవ్వుకు దంత సంరక్షణ చాల ముఖ్యమైనది. మనము ప్రతిరోజు తీసికొనే ఆహారం ద్వారా దంతాలకు చాలా పోషక విలువలనిస్తుంది. డైట్ ప్రొపర్ గా లేనప్పుడు, నోట్లో ఉండే ఆమ్లాలు దంతాల యొక్క ఔటర్ లేయర్ ను కరిగిపోయేలా చేస్తాయి. దాంతో దంతాలు మరింత సెన్సిటివ్ గా మారుతాయి మరియు దంతక్షయానికి కారణం అవుతాయి. దంతాల నొప్పి, తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు వేడి లేదా చల్లటి పదార్థాలు తీసుకొనేటప్పుడు చాలా సెన్సిటివ్ గా అనిపించడం మరియు దంతాల మీద కలర్ మార్పు చెందడం ఇవన్నీ దంత క్షయానికి లక్షణాలు. వ్యక్తులు ఎవరైతే ఫైటిక్ యాసిడ్స్ కలిగిన ధాన్యాలు, నట్స్, మరియు లెగ్యుమ్స్ తీసుకుంటారో వారిలో దంత క్షయం ఎక్కువ రేంజ్ లో ఉంటుంది. ఫైటిక్ యాసిడ్స్ లో ఫాస్పరస్ వ్యక్తుల్లో చాలా త్వరగా షోషింపబడదు. ఫైటిక్ యాసిడ్స్ కూడా డైజెస్టివ్ ట్రాక్ లో కలిసి ఉంటాయి.

మనము రోజు తీసికొనే కొన్ని ఆహారాలు దంతాలు మరియు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది . ఆ ఆహారాలేంటో ఒకసారి తెలిసికుంటాం. ఈ ఆహారాలు పిల్లల నుండి పెద్దల వరకు అందరికి మంచి పోషక విలువలను ఇస్తుంది.

* క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మాత్రమే కాదు, దంతాలకు చిగుళ్లకు కూడా మంచిదే . చిగుళ్ల వ్యాధులు మరియు దంతక్షయం వంటి వ్యాధులు సోకకుండా ఉండాలంటే క్యాల్షియం ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాలి. క్యాల్షియం ముఖ్యంగా పాలు, పెరుగు మరియు చీజ్ మరియు బ్రొకోలీ వంటి వాటిలో ఎక్కువగా ఉన్నాయి.

* విటమిన్ 'డి' సూర్య రశ్మిలో పుష్కలంగా అందుతుంది. అది మాత్రమేకాకుండా ప్రత్యామ్నాయంగా విటమిన్ డి అధికంగా ఉండే ఆయిల్ ఫిష్ (సాల్మన్, సార్డిన్స్ మరియు మెకరెల్స్), గుడ్లు మరియు పాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అంతే కాదు మీరు విటమిన్ డి సప్లమెంట్ ను కూడా అధికంగా తీసుకోవాలి.

precautions,dental,care,calcium,tooth ,దంత, సంరక్షణకు, తీసుకోవలసిన, జాగ్రత్తలు, చిరునవ్వు


* రక్తంలో మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ను క్రియేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది విటమిన్ డి గ్రహించడానికి అది క్యాల్షియంగా మార్పు చెందడానికి చాలా అవసరం అవుతుంది. దీన్ని ఆకుకూరల్లో , ధాన్యాలలో, బాదంలో, బీన్స్, ఫిష్, అవొకాడో మరియు అరటిపండ్లలో ఎక్కువగా కనుగొనడం జరిగింది . ఇది దంతక్షయాన్ని నివారించడానికి ఒక ఉత్తమం మార్గం.

* మాంసాహారం నోటిలో ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ను క్రియేట్ చేయడానికి, అసిడిక్ ఫైటిక్ యాసిడ్ పిహెచ్ క్రియేట్ చేయడానికి సహాయపడుతుంది. రెడ్ మీట్, చికెన్, ఫిష్ మరియు సీఫుడ్స్ లో విటమిన్ బి12 మరియు బి2 లు ఎక్కువగా ఉన్నాయి. టూత్ డెకేని నివారించడంలో మీట్ కూడా ఒక ఉత్తమ ఆహారం.

* ఓమేగా3లో ఉండే హెల్తీ ఫ్యాట్ దంతాలకు చాలా మేలు చేస్తాయి. సాల్మన్, సార్డిన్స్, మెకరెల్స్ వాల్ నట్స్ మరియు ఆలివ్ ఆయిల్ వంటివి మీరు తీసుకోవచ్చు.

* ఫైటిక్ యాసిడ్స్ అధికంగా ఉండే ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతక్షయాన్ని నివారించుకోవచ్చు . ఎందుకంటే వీటిలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి . వీటిలో ఉండే న్యూట్రీషియన్స్ ను శరీరం చాలా త్వరగా షోషింపచేసుకుంటుంది . ఫైటిక్ యాసిడ్స్ అధికంగా ఉండే బాదం, బీన్స్, బ్రాజిల్ నట్స్, బ్రౌన్ రైస్, చిక్ పీస్ , కొబ్బరి, కార్న్ , హాజల్ నట్స్ మరియు లెంటిల్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

precautions,dental,care,calcium,tooth ,దంత, సంరక్షణకు, తీసుకోవలసిన, జాగ్రత్తలు, చిరునవ్వు


* కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది నోట్లో హానికరమైన బ్యాక్టీరియాన్ తొలగించడానికి సహాయపడుతుంది. మీ టూత్ పేస్ట్ లో కొద్దిగా కొబ్బరితురుము లేదా కొబ్బరి నూనె జోడించి రుద్దడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

* కాయగూరలు చాల మేలైన ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది దంత క్షయాన్ని నివారిస్తుంది. వెజిటేబుల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది నోట్లో లాలాజలం ఊరడానికి సహాయపడుతుంది మరియు దంతక్షయం రాకుండా మినిరల్ డిఫెన్స్ ను క్రియేట్ చేస్తుంది.

* బేకింగ్ సోడను వుపయోగించి దంతక్షయను నివారించవచ్చు. మీ దంతాల మీద బేకింగ్ సోడాను వేసి రుద్దాలి. లేదా టూత్ పేస్ట్ లో వేసి బ్రెష్ చేయాలి. నోట్లో ఉండే బ్యాక్టీరియాన్ బేకింగ్ సోడా నివారిస్తుంది. అలాగే నోట్లో ఆల్కలైన్ పిహెచ్ ను క్రియేట్ చేస్తుంది. ఇది దంత క్షయం రాకుండా కాపాడుతుంది.

* బటర్ లో చాలా ఎక్కువగా క్యాల్షియం ఉంటుంది. ఇది దంతక్షయాన్ని నివారిస్తుంది. చాలా మంది ఫ్యాట్ ఉన్న బటర్ ను వాడుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇందులో తక్కువ ఫ్యాట్ ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Tags :
|
|

Advertisement