సహజమైన చిట్కాలతో ముఖం మీద అవాంఛిత రోమాలకు చెక్ పెట్టండి ..
By: Sankar Mon, 13 July 2020 1:03 PM
మహిళలలో కొంతమందికి అవాంఛిత రోమాల సమస్య ఉంటుంది ..అయితే వీటిని తొలగించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు ..అయితే ఇంట్లోనే కొన్ని సహజ పద్దతుల ద్వారా ముఖం పైన ఉండే ఈ అవాంఛిత రోమాల సమస్యకు చెక్ పెట్టవచ్చు ..
వారం రోజుల పాటు రోజూ పాలలో పసుపు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న చోట పట్టించి 20 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేస్తే రోమాలన్నీ తొలిగిపోతాయి.
శనగపిండి, పసుపును సమపాళ్లలో కలిపి ముఖానికి ఫేషియల్ మాదిరిగా పట్టించి ఆరిన తర్వాత నీటితో కడిగితే అవాంఛిత రోమాల్ని నియంత్రించవచ్చు.
ఓ అరటిపండు గుజ్జు, 2 చెంచాల ఓట్‌మీల్ కలిపి ఆ మిశ్రమాన్ని రోమాల మీద పట్టిస్తే 20 నిమిషాలు గుండ్రంగా తిప్పుతూ రుద్ది కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే అవాంఛిత రోమాల సమస్య క్రమంగా తగ్గుతుంది.
నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనెను అవాంచిత రోమాలపై మర్దన చేసి మెత్తని శనగపిండిని రాసి బాగా నొక్కి నలుగు పెట్టాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే అవాంఛిత రోమాలు తొలిగిపోతాయి.