Advertisement

చర్మ సౌందర్యాన్ని పెంచే పాలు

By: chandrasekar Tue, 25 Aug 2020 2:44 PM

చర్మ సౌందర్యాన్ని పెంచే పాలు


పాలు కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. పాలను తాగడమే కాకుండా.. ముఖానికి రాసుకున్నా మేను మెరిసిపోతుంది. అందుకే, సంపన్నులు.. పాలల్లో గులాబీ రేకులు వేసుకుని స్నానం చేసేవారని, వారి చర్మ సౌందర్య రహస్యం అదేనని చెబుతుంటారు. పాల వల్ల చర్మానికి కలిగే ఈ ప్రయోజనాలు గురించి తెలిస్తే.. మీరు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు.

పొడిచర్మంతో బాధపడేవారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. పైన చెప్పినట్లే దూదిని పాలలో ముంచి ముఖమంతా మర్ధనా చేసి.. 20 నిమిషాలు అలా వదిలేయాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. సబ్బు అస్సలు వాడొద్దు. పాలల్లో అరటి గుజ్జును కలిపి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

milk,that,enhances,skin,beauty ,చర్మ, సౌందర్యాన్ని, పెంచే, పాలు, పాలు


ముఖం జిడ్డుగా లేకుండా శుభ్రంగా ఉండాలంటే ముందుగా దూది లేదా పలుచని క్లాత్ తీసుకోండి. దాన్ని పాలల్లో ముంచి ముఖంపై మెత్తగా మర్ధనా చేయండి. ఐదు నిమిషాల పాటు మర్దానా చేసి గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగండి. ఇప్పుడు మీ ముఖం చాలా ఫ్రెష్‌గా పరిశుభ్రంగా ఉంటుంది. జిడ్డు అనేదే కనిపించదు. సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం కంటే పాలతో శుభ్రం చేసుకోవడమే మంచిది.

ఎండలో చాలామందికి ముఖం కమిలిపోతుంది. ఈ సమస్య వెంటనే పోవాలంటే.. ఫ్రిజ్‌లోని చల్లని పాలను తీసుకుని మొదటి చిట్కాలో చెప్పినట్లే ముఖంపై మర్దనా చేయండి. ఇలా చేయడం వల్ల చర్మానికి రక్షణగా ప్రొటీన్ పొర ఏర్పడుతుంది. ముఖం మంట తగ్గి, హాయిగా అనిపిస్తుంది.

రోజూ పాలు తాగడం వల్ల చర్మ గ్రంథులు శుభ్రపడతాయి. పాలు శరీరం బయట, లోపల కూడా క్లెన్సర్‌లా ఉపయోగపడతాయి. బ్లాక్ హెడ్స్, మొటిమలు రాకుండా పాలు అడ్డుకుంటాయి. చర్మంలోని మురికిని, మృత కణాలను బయటికి పంపడంలో పాలు చేసే మేలు మరేది చేయదు.

Tags :
|
|
|

Advertisement