Advertisement

అందాన్నిపెంచే మ‌ల్లెల ర‌సం

By: chandrasekar Tue, 23 June 2020 6:33 PM

అందాన్నిపెంచే మ‌ల్లెల ర‌సం


మ‌ల్లెపూలు మంచి సువాస‌నను వెద‌జ‌ల్ల‌డంతోపాటు జ‌డ అందాన్ని పెంచుతాయి. అంతేనా అలంకరణకు మ‌ల్లెపూలు ఎంతో తోడ్ప‌డుతాయి. అయితే మ‌న‌కు తెలియ‌ని మ‌రో విష‌యం ఏమిటంటే మ‌ల్లెపూల ర‌సం ఆరోగ్యాన్ని, అందాన్ని రెట్టింపు చేస్తుంద‌న‌డంలో ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

* కళ్లు బాగా అలసటగా ఉన్నప్పుడు మల్లెపూల రసంతో కంటి చుట్టు భాగాల్లో మర్దన చేసుకొని పడుకుంటే చల్లగా ఉంటుంది.

* అరోమాథెరపీలో కూడా ఇప్పుడు మల్లెపూలను వాడుతున్నారు.

* మల్లెపూల రసాన్ని, గులాబీల రసంతో కలిపి ముఖానికి రాసుకంటే చర్మం మృదువుగా తయారవుతుంది.

* సబ్బులు, తలనూనెలు, సౌందర్య సాధనాల్లో కూడా నేడు మల్లెపూలను వాడుతున్నారు.

* చర్మానికి అవసరమయ్యే విటమిన్ సి మల్లెపూలలో పుష్కలంగా దొరుకుతుంది.

* మొటిమల వల్ల వచ్చే మచ్చలకు మల్లెల నూనె రాస్తే ఫలితం ఉంటుంది.

* చుండ్రుతో బాధపడేవారు మల్లెపూల రసాన్ని మెంతులతో కలిపి తలకు పట్టించవచ్చు.

* కొబ్బరినూనెతో కలిపి మల్లెపూల రసాన్ని తలకు రాసుకుంటే మంచి సువాసన వస్తుంది.

* మల్లెల సువాసన నిద్రలేమిని కూడా దూరం చేస్తుంది.

* మల్లెపూలతో తయారు చేసే పలు ఔషధాలు కణితులను కూడా నివారిస్తాయని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

Tags :
|

Advertisement