Advertisement

అందమైన కళ్ళకు సరైన పద్దతిలో కాటుక పెట్టుకోవడం ఎలా ..

By: Sankar Fri, 10 July 2020 12:28 PM

అందమైన కళ్ళకు సరైన పద్దతిలో కాటుక పెట్టుకోవడం ఎలా ..



అమ్మాయిల ముఖానికి మేకప్ ఎంత వేసుకున్న రాని అందం కేవలం కళ్ళకు పెట్టుకున్న కాటుకతో వస్తుంది..కళ్ళకు కాటుక పెట్టుకోవడం వలన మన కళ్ళు పలికే బావాలు మరింత అందంగా కనిపిస్తాయి ..అయితే కాటుక వాళ్ళ కేవలం అందం మాత్రమే కాదు కళ్ళకు ఆరోగ్యం కూడా ..మరి కాటుక పెట్టుకునేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ..

1.కాటుక పెట్టుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని కళ్లపై తడి లేకుండా తుడుచుకోవాలి.

2.ఎక్కువగా చెమట పట్టే చర్మతత్వంగలవారు ఉక్కపోతగా ఉన్నప్పుడు కాటుక పెట్టుకునే వారు ముఖాన్ని ఐస్‌ ముక్కలతో మర్దన చేసుకోవాలి. దీనివల్ల చెమట పట్టడం తగ్గి తద్వారా కాటుక చెదరకుండా ఉంటుంది.

3. కాటుక పెట్టుకునే ముందు మెత్తని వస్త్రంతో కనురెప్పను తుడుచుకోవాలి. దీనివల్ల కనురెప్పలపై ఉండే జిడ్డు పూర్తిగా తొలిగిపోతుంది. లేదా కొద్దిగా పౌడర్‌ కళ్ల చుట్టూ రాస్తే చర్మంపై ఉండే జిడ్డును పౌడర్‌ పీల్చుకొని కళ్లు తాజాగా ఉంటాయి.

4. కనురెప్పల కొన భాగంలో కాటుక పెట్టుకొంటే చెరిగిపోయే అవకాశం ఎక్కువ. అందుకని కనురెప్పల మధ్యన కాటుక పెట్టుకోవాలి.

5. కాటుక పెట్టుకునే ముందు కళ్లకు లైట్‌ కలర్‌ ఐషాడో బేస్‌గా వేసుకున్నా కాటుక చెదిరిపోకుండా చూసుకోవచ్చు.

6. నాణ్యమైన కాటుక వాడాలి. కాటుక వాడినప్పుడు దురద, కళ్లు మంటలు పుట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దానిని వాడడం ఆపేయాలి.


Tags :
|
|
|

Advertisement