Advertisement

మృదువైన , అందమైన పాదాల కోసం ఈ చిట్కాలు పాటించండి ..

By: Sankar Thu, 09 July 2020 5:30 PM

మృదువైన , అందమైన పాదాల కోసం ఈ చిట్కాలు పాటించండి ..



మన శరీరంలో ముఖానికి చేతులకు ఇచ్చినంత ప్రాధాన్యత కాళ్లకు ఇవ్వము ..ఎందుకంటే మొహం , చేతులు కనిపిస్తాయి కానీ కాళ్ళు కనిపించవు ..కానీ రోజు వారి మనం చేసే పనుల వలన కాళ్ళు అంధ విహీనంగా తయారు అవుతాయి ..అయితే కాళ్ళు కూడా మృదువుగా అందంగా కనిపించాలి అంటే ఈ చిట్కాలు పాటించాలి ..

1. స్నానం చేసే సమయంలో పాదాలను ఫ్యూమిస్‌ రాయి, స్క్రబ్బర్‌తో రుద్దితే సున్నితంగా కనిపిస్తాయి.

2. పాదాలు పొడిగా, అంద విహీనంగా ఉంటే రోజూ మాయిశ్చరైజర్‌ రాయాలి.

3. పెడిక్యూర్‌ వల్ల పాదాలు కాంతివంతంగా మెరుస్తాయి. వీటిని ఎంపిక చేసుకునేప్పుడు మీ పాదాల సమస్యలకు సరిపోయేవిగా ఉండాలి.

4. మెత్తగా, చదునుగా ఉండే ఫ్లోర్‌మ్యాట్‌ మీద పాదాలను ఉంచి విశ్రాంతి
తీసుకోవాలి.

5. పాద సంరక్షణ కోసం ఫ్యూమిస్‌ స్టోన్‌, ఫూట్‌ క్రీమ్‌, పెడిక్యూర్‌సెట్‌, గ్లిజరిన్‌ వంటివి వాడితే మంచిది.

6. చెప్పులు, షూ మీ పాదాలకు సరిపోయేవి కొనాలి.

7. కాళ్ల పగుళ్లు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌, రంగుమారడం వంటి సమస్యలు ఉన్నప్పుడు డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.

Tags :
|
|
|

Advertisement