Advertisement

జుట్టు ఊడటాన్ని నియంత్రించే ఇంటి చిట్కాలు ..

By: Sankar Mon, 06 July 2020 12:58 PM

జుట్టు ఊడటాన్ని నియంత్రించే ఇంటి చిట్కాలు ..



జుట్టు రాలడం ఇటీవలి కాలంలో మహిళలను ఎక్కువగా కలవరపెడుతున్న అంశం. అప్పటి వరకు ఒత్తుగా.. పొడవుగా ఉన్న జడ కాస్తా.. సన్నగా, కురచగా తయారవడం అనేది ఆడపిల్లలు రోజూ ఎదుర్కొంటున్న సమస్య. ఇలా జరగడానికి ఆరోగ్యపరమైన సమస్యలు, హర్మోన్ల విడుదలల వచ్చిన మార్పులు.. ఇలా ఏదైనా కారణం కావచ్చు. ఒత్తిడి వల్ల సైతం జుట్టు పలచగా అయ్యే అవకాశం ఉంది.అయితే జుట్టు రాలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం ..

1. గుడ్డులో సల్ఫర్, పాస్ఫరస్, సెలీనియం, అయెడిన్, జింక్, ప్రొటీన్ మొదలైనవి ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అందుకే ఎగ్ మాస్క్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. అయితే దీనికోసం గుడ్డులోని తెల్లసొనను వేరుచేసి గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో టీస్పూన్ చొప్పున ఆలివ్ నూనె, తేనె కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి.ఇరవై నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి తలస్నానం చేస్తే సరిపోతుంది.

2. కూరలో కరివేపాకు అని తీసిపడేస్తాం కానీ.. దానివల్ల కురులకు చాలా మేలు జరుగుతుంది. ఇది జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది. జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. అంతే కాకుండా వెంట్రుకలను బలంగా తయారయ్యేలా చేస్తుంది. గిన్నెలో నీరు తీసుకొని దానిలో కొన్ని కరివేపాకులను వేసి బాగా మరిగించాలి.ఈ నీటిని చల్లారనిచ్చి.. ఫ్రిడ్జ్‌లో పెట్టాలి.తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని కురులపై వేసుకోవాలి.ఆ తర్వాత కండిషనర్ రాసుకొంటే సరిపోతుంధీ ..తలస్నానం చేయాలనుకున్న రోజు రాత్రి.. ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకోవడం మంచిది.

3. పెరుగులో ప్రోబయాటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి కురుల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దృఢంగా, పొడవుగా అయ్యేలా చేస్తాయి. తరచూ తలకు పెరుగు ప్యాక్‌లా వేసుకోవడం ద్వారా కురులు ఒక అంగుళం మేర పొడవు పెరుగుతాయి. మరి దీనికోసం ఏం చేయాలో తెలుసా..ఒక గిన్నె నిండా పెరుగు తీసుకోవాలి. దీనిలో టేబుల్ స్పూన్ తేనె, టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసుకొని 40 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.ఇలా చేస్తూ ఉంటె జుట్టు రాలిపోయే సమస్య తగ్గుతుంది

4.బీట్ రూట్ ఆహారంగా తీసుకోవడం ద్వారా ర‌క్తవృద్ధి జరుగుతుంది. ఆరోగ్యపరంగానే కాదు సౌందర్యపరంగానూ బీట్ రూట్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీనిలో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. ఇవి కురులను దృఢంగా మారుస్తాయి. దీనికోసం.. బీట్ రూట్‌ను సన్నని ముక్కలుగా చేసి మిక్సీలో వేయాలి. అలాగే కొన్ని గోరింటాకులను సైతం వేసి బాగా మెత్తగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తలకు రాసుకొని.. పావుగంట నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.





Tags :
|
|

Advertisement