Advertisement

  • కొత్తిమీర కూరల్లోనే కాదు ..చర్మానికి కూడా అందాన్ని తెస్తుంది

కొత్తిమీర కూరల్లోనే కాదు ..చర్మానికి కూడా అందాన్ని తెస్తుంది

By: Sankar Sun, 28 June 2020 5:30 PM

కొత్తిమీర కూరల్లోనే కాదు ..చర్మానికి కూడా అందాన్ని తెస్తుంది



కొత్తిమీర ..కూరల్లో ఎన్ని రకాల పదార్ధాలు వేసిన చివర్లో కొత్తిమీర వేయడం వలన ఆ కూర మొత్తానికి మంచి సువాసన , రుచి వస్తుంది ..అందుకే ముఖ్యంగా నాన్ వెజ్ వండేప్పుడు తప్పనిసరిగా కొత్తిమీరను వాడతారు ..అయితే ఈ కొత్తిమీర వలన కేవలం కూరలకే కాకుండా అందాన్ని పెంచుకునేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు ..ముడతలను పొగొట్టడంతోపాటు చర్మం మరింత కాంతివంతంగా కనిపించేందుకు కొత్తిమీర ఉపయోగపడుతుంది. ఇందుకు ఈ కింది టిప్స్‌ను పాటించండి.

1.చాలామంది చిన్నవయస్సులోనే వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. చర్మం ముడతలు పడి పెద్ద వయస్సు వ్యక్తుల్లా కనిపిస్తారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఈ చిట్కా పాటించండి. కొత్తిమీరను బాగా పేస్ట్ చేయండి. అందులో కాస్త కలబంద గుజ్జును కలపండి. ఆ పేస్టుకు ముఖానికి రాసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు తర్వాత నీళ్లతో కడిగేసుకోండి. కొత్తిమీరలో ఉండే విటమిన్-A చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా తాజాగా ఉంటుంది. వారంలో కనీసం రెండు, మూడు సార్లు ఈ చిట్కా పాటిస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.

2. వేసవిలో పెదవులు ఆరిపోతూ ఉంటాయి. వాటిని తడి చేస్తూ ఉండటం వల్ల పొడిగా మారి పొరలు ఏర్పడతాయి. ఆ సమస్య లేకుండా ఉండాలంటే.. కొత్తిమీర పేస్టును పెదాలకు రాయండి. కొత్తిమీర పేస్టునులో కాస్త నిమ్మ రసం వేయండి. రెండిటినీ బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని మీ పెదవులకు పూయండి. ఇలా రోజూ చేస్తుంటే.. మీ పెదాలు అందంగా మారిపోతాయి.

3 .కాలుష్యం వల్ల చర్మంపై ఎన్నో మలినాలు పేరుకుపోతాయి. వాటిని తొలగించకపోతే.. క్రమేనా చర్మాన్ని నాశనం చేస్తాయి. ఇవి చర్మ క్యాన్సర్లకు కూడా దారితీసే ప్రమాదం ఉంది. మీ చర్మం నిత్యం కాంతివంతంగా.. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ టిప్ పాటించండి. కొత్తిమీరను పేస్టులా చేసుకుని.. అందులో టమోటా గుజ్జు, ముల్తానీ మట్టి, నిమ్మరసం కలపండి. అనంతరం ఆ మిశ్రమాన్ని కళ్లకు తగలకుండా ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయండి. వారంలో రెండు, మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Tags :
|
|

Advertisement