Advertisement

ముల్తానీ మట్టి ప్రయోజనాలు

By: chandrasekar Wed, 03 June 2020 6:24 PM

ముల్తానీ మట్టి ప్రయోజనాలు

ముల్తానీ మట్టిలో అద్భుతమైన లక్షణములు ఉన్నవి. దీనిలో ఖనిజాలు ఎక్కువగా ఉండటం వలన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది చర్మంలోని గరుకుతనాన్ని పోగొట్టి చర్మాన్ని మృధువుగా చేస్తుంది. ముల్తానీ మట్టి చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి కొత్త చర్మ కణాలను ఉత్తేజ పరుస్తుంది.

పురాతన కాలం నుంచి ముల్తానీ మట్టి సహజంగా మొటిమలను తగ్గించుటకు ఉపయోగిస్తున్నారు. ముల్తానీ మట్టి చర్మ రకములన్నింటికి ఉపయోగపడుతుంది.

కాంతివంతమైన చర్మం కోసం 2-3 స్పూన్స్ ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, దోసకాయ గుజ్జు మరియు 2-3 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడగాలి.

2 టేబుల్ స్పూన్స్ ముల్తానీ మట్టి, ½ టేబుల్ స్పూన్స్ గంధపు పొడి మరియు చిటికెడు పసుపు తీసుకుని అన్నింటిని బాగా కలిపి, మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో శుభ్ర పరచాలి. ఇది ఆయిలీ మరియు పొడి చర్మాలకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

ముల్తానీ మట్టి, తేనే, పసుపుతో చేసిన ప్యాక్ మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.

benefits,of,multani,soil,uses,beauty benefits ,ముల్తానీ, మట్టి, ప్రయోజనాలు, మెరిసేలా, చేస్తుంది

పొడి మరియు ఆయిలీ చర్మం కోసం 2-3 స్పూన్స్ ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 స్పూన్ నిమ్మరసం మరియు చిటికెడు పసుపు తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత చల్లని లేక గోరువెచ్చని నీటితో కడగాలి.

చర్మంలో మార్పు కోసం 2-3 టేబుల్ స్పూన్స్ ముల్తానీ మట్టి మరియు 2 టేబుల్ స్పూన్స్ బంగాళదుంప గుజ్జు తీసుకుని బాగా కలపాలి. మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకి అప్లై చేసి, 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.

ఆయిలీ చర్మం కోసం 2-3 టేబుల్ స్పూన్స్ ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ టమాటో గుజ్జు, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక టేబుల్ స్పూన్ తేనే తీసుకుని పేస్టులా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకి పట్టించి, 20 నిమిషముల తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయండి.

సన్ టాన్ని తొలగించుటకు 2-3 టేబుల్ స్పూన్స్ ముల్తానీ మట్టి, 1 ½ టేబుల్ స్పూన్ కొబ్బరి నీరు మరియు ¼ టేబుల్ స్పూన్ పంచదార తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకి ప్యాక్ వేసుకుని, 15 నిమిషముల తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి.

పొడి చర్మం కోసం 2 టేబుల్ స్పూన్స్ ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్స్ పాల పొడి, ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, ఒక టేబుల్ స్పూన్ గుడ్డులోని తెల్ల పొర, ఒక టేబుల్ స్పూన్స్ పెరుగు మరియు ఒక టేబుల్ స్పూన్ తేనే తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి.

benefits,of,multani,soil,uses,beauty benefits ,ముల్తానీ, మట్టి, ప్రయోజనాలు, మెరిసేలా, చేస్తుంది

ముల్తానీ మట్టి మరియు బాదం యొక్క పేస్ ప్యాక్ చర్మాన్ని నునుపుగా చేస్తుంది. పాలల్లో ముల్తానీ మట్టి మరియు బాదం కలిపి ప్యాక్ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

ముల్తానీ మట్టి మరియు బాదం యొక్క పేస్ ప్యాక్ చర్మాన్ని నునుపుగా చేస్తుంది. పాలల్లో ముల్తానీ మట్టి మరియు బాదం కలిపి ప్యాక్ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

మొటిమలు వాటి మచ్చలకు 2 టేబుల్ స్పూన్స్ ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి. మీరు ఊహించని అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.

నెల రోజులలో ముల్తానీ మట్టి , రోజ్ వాటర్, బంగాళదుంపతో చేసిన పేస్ ప్యాక్ చర్మాన్ని మచ్చ లేకుండా చేస్తుంది. మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత చల్లని మరియు గోరు వెచ్చని నీటితో కడగాలి.

ఆయిలీ చర్మం మరియు మొటిమలు 2 టేబుల్ స్పూన్స్ ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ వేప పొడి, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని అన్నింటిని బాగా కలిపి పేస్టులాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 30 నిమిషముల తరువాత నీటితో శుభ్రం చేసుకుంటే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. అంతే కాకుండా బాక్టీరియాను దగ్గరకు రానివ్వకుండా చేస్తుంది.

benefits,of,multani,soil,uses,beauty benefits ,ముల్తానీ, మట్టి, ప్రయోజనాలు, మెరిసేలా, చేస్తుంది

ప్రకాశవంతమైన చర్మం కోసం ముల్తానీ మట్టి మరియు తేనే యొక్క పేస్ ప్యాక్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ముల్తానీ మట్టి, తేనే మరియు రోజ్ వాటర్ తీసుకుని అన్నింటిని బాగా కలిపి, మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

వర్ణక చర్మం కోసం ముల్తానీ మట్టి, క్యారెట్ గుజ్జు మరియు ఆలివ్ ఆయిల్ తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 30 నిమిషముల తరువాత నీటితో వాష్ చేయండి.

టోన్డ్ మరియు ఆయిలీ చర్మం కోసం సమాన మోతాదులో పాలు, ముల్తానీ మట్టి, గంధపు పొడి తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

నల్లని మచ్చల కోసం ముల్తానీ మట్టి, వేప, రోజ్ వాటర్ వాడటం వలన నల్లని మచ్చలు తొలగుతాయి. వీటితో ప్యాక్ తయారు చేసి మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి. మొటిమలతో బాధపడే వారికి ఇది ఒక మంచి చిట్కా.

టాన్ చర్మం కోసం ముల్తానీ మట్టి, తేనే, శనగపిండి మరియు దోసకాయ రసం తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇది టాన్ చర్మాన్ని తొలగించుటకు వేసవిలో ఉపయోగపడుతుంది.

చర్మం స్పష్టమైన రంగుకు మారడం కోసం బొప్పాయి, ముల్తానీ మట్టి, 2 విటమిన్-ఇ టాబ్లెట్స్ తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే మీ చర్మం రంగు మారిందో అక్కడ అప్లై చేసి 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

Tags :
|
|
|

Advertisement