Advertisement

పొడి చర్మం వేధిస్తోందా ...అయితే ఈ చిట్కాలు వాడండి

By: Sankar Sun, 09 Aug 2020 6:15 PM

పొడి చర్మం వేధిస్తోందా ...అయితే ఈ చిట్కాలు వాడండి



చలి కాలంలో చర్మం పగిలినట్లుగా పొడిగా మారుతుంది ముఖం తెల్లగా పొడిబారినట్లు నిర్జీవంగా కనిపిస్తుంటుంది. అలాంటివారు ఈ చిట్కాలు పాటిస్తే చాలు.

1. పొడిచర్మం ఉన్నవారు బయటికి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ లోషన్‌ ముఖానికి ఐప్లె చేయాలి. నల్లద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ప్రతి రోజూ స్నానానికి 20 నిమిషాల ముందు ముఖానికి రాసుకుని ఆ తర్వాత స్నానం చేస్తే చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది.

2. కొంచెం క్యారెట్‌, కొంచెం క్యాబేజీ, కొంచెం ఓట్స్‌ కలిపి మిక్సీ పట్టుకోవాలి. దానిలో కొంచెం పాలమీగడ, అరటీస్పూన్‌ తేనె, రెండు చెంచాల నిమ్మరసం కలపాలి. ఆమిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి.

3. శరీరంలో నీటి శాతం తగ్గితే చర్మం పొడిబారుతుంది. పెదవులు చిట్లిపోతాయి. నీటిని ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా తాగడం ఇష్టం ఉండని వారు నీటిశాతం ఎక్కువ ఉన్న పండ్లు తీసుకోవాలి.

4. ముఖం, పెదవులు పగిలినట్లుగా అనిపిస్తుంటే కాస్తంత రోజ్‌వాటర్‌లో కొబ్బరి నూనె కలిపి ముఖంపై మర్దన చేయాలి. రోజూ రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి రాసుకుంటే మంచిది. పెదాలకు కొబ్బరి నూనెతో మర్దన చేయడం వల్ల పెదాలు పగలకుండా ఉంటాయి. కొబ్బరి నూనె పెదాలకు రాసుకొని బ్రష్‌తో మెల్లిగా మర్దన చేసుకోవచ్చు.

5. చర్మం పొడిబారడం, గోకితే పొట్టులేవడం వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కొబ్బరి నూనెను శరీరానికి రాస్తే సరి. పొడిబారిన చర్మం నుంచి, దురద నుంచి ఉపశమనం పొందవచ్చు.

Tags :
|
|
|
|
|

Advertisement