Advertisement

  • మీ అందాన్ని రెట్టింపు చేయడంలో పెసలు అద్భుత పాత్ర పోషిస్తాయి

మీ అందాన్ని రెట్టింపు చేయడంలో పెసలు అద్భుత పాత్ర పోషిస్తాయి

By: Sankar Tue, 01 Sept 2020 8:23 PM

మీ అందాన్ని రెట్టింపు చేయడంలో పెసలు అద్భుత పాత్ర పోషిస్తాయి


పెసరపప్పు అనగానే మనకి మొలకెత్తిన పెసలూ, పెసరట్లు బాగా గుర్తొస్తాయి. వాటికే కాదు, పెసలు సౌందర్య సాధనంగా కూడా పనికొస్తాయి. ముఖం, చర్మం, జుట్టు - ఎలాంటి సమస్యలకైనా పెసలతో చెక్ పెట్టేయొచ్చు. బ్యూటీ పార్లర్స్ లేని ఈ సమయంలో పెసర్లతో ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటిని వాడి మన అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు. సో..ఈ పెసలని ఎలా వాడచ్చో ఓసారి చూసేయండి మరి.

1. జుట్టు ఊడిపోతున్నా, డ్రై అయిపోతున్నా జుట్టు డల్ గా ఉన్నా పెసలతో చేసే హెయిర్ పాక్ బాగా పనిచేస్తుంది. కాసిని పెసల్ని ఉడకబెట్టి రుబ్బండి. ఇందులో గుడ్డు పచ్చసొన, కొంచెం నిమ్మరసం, పెరుగూ వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి పదిహేను నిమిషాలు ఉంచండి. మైల్డ్ షాంపూ తో తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకోండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి. జుట్టుకి సంబంధించిన అన్ని సమస్యలని ఈ ప్యాక్ పోగొడుతుంది.

2. చాలా మంది మొటిమలతో బాధపడుతుంటారు. మొటిమలతో, యాక్నే తోటీ విసుగెత్తిన వారందరూ ఒక్కసారి పెసలు వాడి చూశారంటే ఇంక వాటిని వదలరు. గుప్పెడు పెసలని రాత్రంతా నీటిలో నానబెట్టండి. పొద్దున్న వాటిని మెత్తగా రుబ్బండి. అందులో కొంచెంగా నెయ్యి కలిపి ముఖానికి అప్లై చేయండి. ముఖాన్ని నెమ్మదిగా మసాజ్ చేస్తూ పది నిమిషాలుంచండి. గోరువెచ్చటి నీటితో కడిగేసి ముఖాన్ని మెత్తటి బట్టతో క్లీన్ చేయండి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

3. సమ్మర్ వచ్చిందంటే సన్ టాన్ కూడా వచ్చినట్టే. మండే ఎండలో బైటికి వెళ్ళాల్సి వచ్చినవారికి టానింగ్ పెద్ద సమస్య. దీని కోసం, గుప్పెడు పెసల్ని రాత్రంతా నీటిలో నానబట్టి పొద్దున్న మెత్తగా రుబ్బండి. ఇందులో చల్లటి పెరుగు గానీ, అలోవెరా జెల్ కానీ వేసి కలపండి. ముఖం మీద, చేతుల మీద, టానింగ్ సమస్య ఎక్కడుంటే అక్కడ, ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. ఒక పదినిమిషాలు ఉంచేసి చల్లని నీటితో కడగండి. ఇది టాన్ పోగొట్టడమే కాదు, చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

4.పెసలు శరీరంలో వేడిని తగ్గిస్తాయి. ఇవి వడదెబ్బ కొట్టినప్పుడు, చెమట కాయలు, దురదలు దద్దుర్లు వచ్చినప్పుడు వాడితే మంచి ఫలితం ఉంటుంది. కాలిన గాయాలు, ఎప్పటికీ మానని పుండ్లతో బాధపడే వాళ్లకు, ఆపరేషన్లు అయిన వారికీ పెసలు వంటలు పెట్టడం వల్ల ఉపశమనం కలుగుతుంది. సున్నిపిండిలో కూడా పెసలను వాడుతారు. దీనిని వాడినా.. చర్మం ముడతలు పడకుండా.. నిగారింపు సంతరించుకుంటుంది.

5. మార్కెట్స్‌లో ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇవన్నీ ఎన్నో ఫలితాలను పెసర్లు ఇస్తాయి. వీటిని వాడడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. అంతేకాక, ఇవి అందరికీ అందుబాటులో కూడా ఉంటాయి కాబట్టి చక్కగా వాడి వీటి ప్రయోజనాలనీ మీరు పొందొచ్చు.

Tags :
|
|

Advertisement