Advertisement

చర్మ సౌందర్యానికి పసుపు ఉపయోగాలు ..

By: Sankar Mon, 03 Aug 2020 6:13 PM

చర్మ సౌందర్యానికి పసుపు ఉపయోగాలు ..



పసుపు లో అనేక యాంటీ బయాటిక్ లక్షణాలు ఉంటాయి ..అందుకే ఈ కరోనా కాలంలో పసుపు యొక్క ప్రాధాన్యత బాగా పెరిగింది ..కాని, పసుపు వలన సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా పసుపును ఉపయోగించి వివిధ చర్మ సమస్యలు తొలగించుకోవచ్చు.అవేమిటో ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాం.

1. మనలో చాలామందికి పస్సుపు మొటిమలను తగ్గించడానికి పనికివస్తుందని తెలియదు. ఇది పసుపు వలన కలిగే అనేక ప్రయోజనాల్లో ఒకటి. పసుపులో యాంటి సెప్టిక్ మరియు యాంటీ బాక్టీరియల్ తత్వాలు, మొటిమలను పోగొట్టడంలో సహాయపడతాయి. భారతదేశంలో చాలామంది స్త్రీలు మెరిసే చర్మం కొరకు పసుపును ఫేస్ ప్యాక్ గా వాడతారు.

2. పసుపులో నొప్పి నివారణ తత్వాలు మరియు యాంటీ బాక్టీరియల్ తత్వాలు ఉంటాయి. ఇవి కాలిన గాయాలకు వాపు రాకుండా చూస్తాయి. పసుపును కొబ్బరినూనె, ఆముదం, ఆలివ్ ఆయిల్ వంటి నూనెలతో కలిపి కాలిన గాయాలపై పూస్తే మంచి ఫలితముంటుంది.

3. పసుపు ముడుతలను పోగొట్టడంలో ప్రసిద్ధి చెందింది. ఒక చెంచాడు పసుపును, వరిపిండిని కలపండి. దీనిలో టమాటో రసం మరియు పాలు కలిపి పేస్టు తయారు చెయ్యండి. ఈ పేస్టును ముడుతలపై పూయండి. ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది పసుపు వలన కలిగే ఒక సౌందర్య ప్రయోజనం.

4.పసుపు జిడ్డు చర్మం కలిగిన వారికి మంచి చేస్తుంది. దీనికి పసుపుతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఒక టీ స్పూన్ గంధం పొడికి, కొంచం పసుపు కలపండి. దీనికి కొన్ని చుక్కల నారింజ రసం కలిపి ముఖానికి రాయండి, పదిహేను నిమిషాలు ఆరనిచ్చి నీటితో శుభ్రంగా కడిగేయండి..

5.పసుపు స్ట్రెచ్ మార్కులను తెలికపరచడానికి అమోఘంగా పని చేస్తుందని చెప్తారు. పసుపును శనగపిండి మరియు పాలతో కలిపి ముద్దగా చేసి, ఆ ముద్దను ముఖానికి నలుగులా పెట్టుకుంటే స్ట్రెచ్ మార్కులు తొలగిపోతాయి.



Tags :
|
|

Advertisement