Advertisement

చర్మ సౌందర్యానికి పసుపు యొక్క ఉపయోగాలు

By: Sankar Tue, 07 July 2020 7:00 PM

చర్మ సౌందర్యానికి పసుపు యొక్క ఉపయోగాలు



చ‌ర్మ సౌంద‌ర్యానికి ప్ర‌కృతి అందించిన స‌హ‌జసిద్ధ‌మైన‌ ఉత్ప‌త్తుల కంటే ఉత్త‌మైన‌వి మ‌రేవీ ఉండ‌వు. ఈ క్ర‌మంలోనే ఒక‌ప్పుడు మ‌హిళ‌లు తమ అందాన్ని కాపాడుకోవడానికి పసుపునే ఎక్కువ‌గా ఉపయోగించేవారు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ప్రస్తుత తరంలో పసుపు ఉపయోగించడానికి ఎవరూ అంత ఆసక్తి చూపించడం లేదనే చెప్పుకోవాలి. కానీ పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకొంటే.. మనమూ దాన్ని ఉపయోగించడం మొదలుపెడతాం.

1. సూర్యరశ్మి ప్రభావం వల్ల స్కిన్ పై ట్యాన్ పెరగం స‌హ‌జ‌మే. చాలామంది దీని నుంచి విముక్తి పొందేందుకు మార్కెట్లో దొరికే ర‌క‌ర‌కాల ట్యాన్ ప్యాక్ లు ఉపయోగించడం లేదా బ్యూటీ పార్లర్లను ఆశ్రయించడం వంటివి చేస్తారు. అయితే చర్మంపై ఉన్న ట్యాన్ ను పసుపు సమర్థంగా పోగొడుతుంది. బీచ్ హనీమూన్ కి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత మీ చర్మంపై ఏర్పడిన ట్యాన్ ను పోగొట్టడానికి పసుపు, చందనం, నిమ్మరసం తగుపాళ్లలో కలిపి చర్మానికి ప్యాక్ లా వేసుకొంటే.. ట్యాన్ పోతుంది.

2. సాధారణంగా మన మోచేతులు, మోకాళ్ల వ‌ద్ద ఉండే చర్మం కాస్త నల్లగా ఉంటుంది. ఈ డార్క్ ప్యాచెస్ ను పసుపు ఉపయోగించి సులభంగా పోగొట్టచ్చు. దీనికోసం శెనగపిండిలో కొద్దిగా పసుపు, నిమ్మరసం కలిపి అప్లై చేసుకొంటే.. డార్క్ ప్యాచెస్ క్రమంగా చర్మం రంగుకి మారతాయి.

3. వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు, గీతలు ఏర్పడటం సహజం. వీటిని తగ్గించుకోవడం కోసం పచ్చిపాలల్లో బియ్యప్పిండి, కొద్దిగా పసుపు కలిపి మిశ్రమంగా చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత దీనిని శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ ప్యాక్ మీ చర్మాన్ని తిరిగి యవ్వనం గా మారుస్తుంది.

4. పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. ప‌సుపులో త‌గిన‌న్ని నీళ్లు వేసి ముద్దగా చేసి ముఖానికి రాసుకొని పావుగంట తర్వాత కడిగేయాలి. ఇలా కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి.

5. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యవ్వనమైన మెరిసే చర్మాన్ని అందిస్తాయి. ఇవి చర్మంపై కొత్త కణాలు పెరిగేలా చేస్తాయి. ఫ‌లితంగా చర్మం ఎప్పుడూ యవ్వనంగా ఉంటుంది. అయితే ఈ ఫలితాన్ని పొందడానికి పసుపు, తేనె మిశ్రమంగా చేసి వాడాల్సి ఉంటుంది.

6. కొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా చర్మం చాలా జిడ్డుగా తయారవుతుంటుంది. దీనికి కారణం చర్మ గ్రంథుల నుంచి అధికంగా విడుదలయ్యే సీబమ్. దీనివల్ల చర్మం తన మెరుపుని కోల్పోతుంది. దీనికోసం గంధం, పసుపుని కమలాఫల రసంలో కలిపి ముద్దగా చేసి ముఖానికి మాస్క్ లాగా అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.


Tags :
|
|
|

Advertisement