Advertisement

చర్మ నిగారింపును పెంచే చందనం యొక్క ఉపయోగాలు ..

By: Sankar Thu, 16 July 2020 5:15 PM

చర్మ నిగారింపును పెంచే చందనం యొక్క ఉపయోగాలు ..



చర్మం ముఖ్యంగా మొహాన్ని అందంగా తయారు చేయడం కోసం ఎన్నో బ్యూటీ క్రీమ్స్ వాడుతుంటారు ..అయితే అవన్నీకెమికల్స్ ఉండి చర్మానికి హాని కలిగిస్తాయి అందుకే చర్మ సౌందర్యంకోసం సహజపద్దతులను వాడటం మంచిది..

చర్మానికి నిగారింపు తేవడంలో, మృదుత్వాన్నిఅందించడంలో చందనం మొదటి స్థానంలో ఉంటుంది...చందనం వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ..
1. కలబంద గుజ్జులో కాస్త చందనం పొడి కలిపి ఫ్రిజ్ పెట్టుకోవాలి. ఎండలోనుంచి వచ్చాక ముఖాన్ని ఒకసారి నీళ్లతో కడిగేసుకుని, తరువాత కలబంద - చందనం గుజ్జుని అప్లయ్ చేసుకోవాలి. ఓ పావుగంట సేపు అలా వదిలేసి తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. చక్కని కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.

2. ఎండలో బాగా తిరిగి వచ్చాక చర్మం చాలా నిగారింపును కోల్పోతుంది. మురికిగా తయారవుతుంది. అలాంటప్పుడు చందనం, పసుపు, పెరుగు లేదా పాలు కలిపి ఆ పేస్టుని ముఖానికి పట్టించాలి. అలా అరగంట సేపు ఉంచాక నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే పోయిన నిగారింపు తిరిగి వచ్చేస్తుంది.

3. ముఖంపై మొటిమలు లాంటివి వస్తుంటే... వేపాకును ఎండబెట్టి పొడి చేసుకుని డబ్బాలో వేసుకోండి. ఆ పొడిలో కాస్త చందనం పొడి, నీళ్లు కలిపి ముఖానికి, మెడకి పట్టించాలి. దీని వల్ల చర్మం మొటిమలకు దారితీసే బ్యాక్టీరియా పోతుంది. మొటిమల సమస్య అదుపులో ఉంటుంది. చర్మం కూడా మంచి కాంతివంతంగా అవుతుంది.

4. చందనంపొడి, కాస్త శెనగ పిండి, పాలు కలిపి నలుగులా ముఖానికి పట్టించి, బాగా రుద్ది స్నానం చేస్తే ముఖం మీది మృతకణాలు పోతాయి.

Tags :
|
|

Advertisement