Advertisement

  • గంజిని ఈ విధంగా వాడితే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది ..

గంజిని ఈ విధంగా వాడితే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది ..

By: Sankar Fri, 10 July 2020 3:54 PM

గంజిని ఈ విధంగా వాడితే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది ..



అన్నం వండేప్పుడు చాలా మంది గంజిని బయట పారబోస్తారు ..అయితే ఆ గంజిలోనే అనేక పోషక విలువలు ఉంటాయి ..పూర్వం చాల మంది ఆ గంజి తాగి బతికేవారు ..అయితే రాను రాను గంజి వాడకం చాలా తగ్గిపోయింది ..అయితే గంజి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ..

1.ఒకప్పుడు గంజిని షాంపూగా, హెయిర్‌ కండీషనర్‌గా వాడేవారు. గంజిని ఉపయోగించడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుంది. గంజిలోని ఇనోసిటోల్‌ అనే కార్బోహైడ్రేట్‌ జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

2. కాలుష్యం, జీవనశైలి, ఒత్తిడి కారణంగా జుట్టు ఊడిపోతుంది. గంజిలోని అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. లావెండర్‌ ఆయిల్‌ని కొద్దిగా గంజిలో కలిపి జుట్టుకు పట్టించి పదినిమిషాల తర్వాత కడిగితే హెయిర్‌ కండీషనర్‌గా ఉపయోగపడుతుంది.

3. చర్మం పాలిపోయినట్లుగా, నల్లబడి ఉంటే గంజిని ఓ గిన్నెలో తీసుకొని కాటన్‌బాల్‌తో చర్మంపై రుద్దాలి. రోజూ ఇలా 15 నిమిషాలు చేస్తే రక్త ప్రసరణ మెరుగవుతుంది. మొటిమల తాలూకూ రంధ్రాలపై కాటన్‌ బాల్‌తో గంజిని రాస్తే కొన్ని రోజులకు రంధ్రాలు తొలిగిపోతాయి.

4. గంజి నీళ్లలో కాస్త పసుపు వేసి బాగా కలపాలి. కాటన్‌ బాల్‌తో ముఖంపై తుడిస్తే ముఖంపై మచ్చలు, ముడతలు తొలగిపోయే అవకాశం ఉంది. కాకపోతే క్రమం తప్పకుండా నెల రోజులు ఇలా చేయాల్సి ఉంటుంది.

Tags :
|

Advertisement