Advertisement

గురుపూర్ణిమ ఎందుకు జరుపుకుంటామో తెలుసా..? ..అసలు బుద్దులకు ఎందుకు అంత ప్రత్యేకం ..?

By: Sankar Sun, 05 July 2020 5:45 PM

గురుపూర్ణిమ ఎందుకు జరుపుకుంటామో తెలుసా..? ..అసలు బుద్దులకు ఎందుకు అంత ప్రత్యేకం ..?



గురు పూర్ణిమ ..గురువులను పూజించుకునే రోజు ..హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలోని పౌర్ణమి తిథినాడు గురుపూర్ణిమ జరుపుకుంటారు. వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు. అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం. ఈ ఏడాది జులై 5న అంటే ఆదివారం రోజు జరుపుకోనున్నాం. గురుపూర్ణిమ బౌద్ధులకు కూడా ఎంతో ప్రత్యేకమైన రోజు. మరి ఈ రోజు బౌద్ధులకు ఎందుకు అంత ప్రత్యేకమైన రోజో ఇప్పుడు తెలుసుకుందాం.

గౌతమ బుద్ధుడు బోధ గయలో జ్ఞానోదయం అనంతరం తన మొదటి బోధన సారనాథ్ లో ఇచ్చాడనే సంగతి అందరికి తెలిసిందే. బోధగయ నుంచి 5 వారాల పాటు సారనాథ్ కు ప్రయాణం సాగించి అక్కడ తన మొదటి ప్రసంగాన్ని ఇచ్చాడు. మొదటి బోధనను గురుపూర్ణిమ రోజే బుద్ధుడు తన శిష్యులకు బోధించాడు. పంచవర్గికా అనే ఐదుగురు శిష్యుల వినతి మేరకు గౌతముడు తన దివ్యోపదేశాన్ని అందించాడు. ఈ మొదటి ప్రసంగం అనంతరమే ధర్మచక్రపరివర్తనను ఇదే రోజు అనుసరించాడు.

అందువల్ల గురుపూర్ణి బౌద్ధులకు ఎంతో ప్రత్యేకం.గురు పూర్ణిమ రోజున బౌద్ధులు ఉపోసత అనే ఆధ్యాత్మిక కర్మను పాటిస్తారు. దీని ఫలితంగా అశుద్ధమైన మనస్సు ప్రక్షాళన అవుతుంది. ఈ పవిత్రమైన రోజున వారు తమ గురువులకు గురుదక్షిణ చెల్లిస్తారు.


Tags :
|

Advertisement