Advertisement

అద్దెకు ఇల్లు తీసుకోవాలనుకునే విద్యార్థులు వాస్తు పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

By: Sankar Wed, 26 Aug 2020 4:54 PM

అద్దెకు ఇల్లు తీసుకోవాలనుకునే విద్యార్థులు వాస్తు పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు


ప్రతి ఇంటికి వాస్తు అనేది ముఖ్యం అనే సంగతి తెలిసిందే.. అందరికీ సొంతిల్లు ఉండటం సాధ్యం కాదు కాబట్టి.. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా అద్దె ఇంట్లోనే ఉంటారు .మరి అలా అద్దె ఇంట్లో ఉండేవారికి వాస్తు పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ..

1. విద్యార్థులు ఎప్పుడూ తూర్పు,ఉత్తర గృహాలను మాత్రమే కిరాయికి తీసుకోవాలి..తూర్పు నుంచి ఉత్తరానికి, ఉత్తరం నుంచి తూర్పునకు నడక సాగే ఇంటిని అద్దెకు తీసుకోవాలి.

2. . ఆ ఇంట్లో ఆగ్నేయ భాగంలో పడక గది ఉండరాదు. నైరుతి దిశలో బాత్ రూమ్ లేకుండా చూసుకోవాలి.. గడప లేని గృహంలో నివసించే ప్రయత్నం చేయవద్దు.

3. మిద్దె మీద ఉన్నట్లయితే మెట్ల కింద బాత్ రూమ్ ఉన్న గది తీసుకోకూడదు. దక్షిణం మధ్యభాగంలో కిటికీ ఉండొద్దు. ముఖ్యంగా వీధి చివరన ఉన్న గృహాన్ని కిరాయికి తీసుకోకూడదు

4. శ్మశానానికి చేరువలోని గృహాన్ని తీసుకుని ఇబ్బందులు పడొద్దు. గృహానికి ఎదురుగా గుబురు పొదలు ఉండే గృహాన్ని విద్యార్థులు ఎంపిక చేసుకోవద్దు.

5. పాద రక్షల దుకాణం ఉంటే నిర్భయంగా తీసుకోండి, కలిసొస్తుంది

6. గాలి వెలుతురు ధారాళంగా ఉండే గృహాన్ని ఎంచుకోండి. లిఫ్ట్ ఎదురుగా, మెట్ల ఎదురుగా ఉన్న గృహాన్ని ఎంచుకోవద్దు

7. ముఖ్యంగా నైరుతి భాగాన్ని తాకుతూ కిందకు వెళ్లే మెట్లు, లిఫ్ట్ ఉన్న ఇంటిని త్యజించండి.

Tags :
|
|
|

Advertisement